మీరా చోప్రాకు కౌంటర్ ఇస్తూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మద్దతు ఇచ్చిన ఖుష్బూ..!

1526
senior actress khushbu sundar indirect counter on meera chopra
senior actress khushbu sundar indirect counter on meera chopra

మీరా చోప్రాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదు అని మీరా చోప్రా అనడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీరా చోప్రాని బండబూతులు తిట్టారు. దాంతో ఈ వ్యవహారం సైబర్ క్రైమ్ వరకు వెళ్లింది. మీరా చోప్రా గ్యాప్ లేకుండా ఎన్టీఆర్ అభిమాబులపై మండిపడుతుండడంతో ఆమెకు కౌంటర్ గా సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ స్పందించింది.

ఎన్టీఆర్ హీరో గురించి ఒక్క మాట చెప్పమని ఆయన ఫ్యాన్స్ మీరా చోప్రాని అడగటంతో అతను ఎవరో నాకు తెలియదని అనడంతో ఆమెను బీభత్సంగా ట్రోల్ చేశారు. కొందరైతే పచ్చి బూతులు తిడుతున్నారు అని మీరా చోప్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫైనల్ గా ఆమె ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఫిర్యాదు కూడా చేసింది. ఈ వివాదంలోకి అనుకోకుండా నటి ఖుష్బూ ఎంట్రీ ఇచ్చింది. కొందరు మహిళలు ఎప్పటికి మారరు. నేర్చుకోరు కూడా.. ఆ విషయంలో వాళ్ళు పేద వాళ్ళు.. అంటూ ఆమె ఊహించని కౌంటర్ ఇచ్చారు.

పేరు ప్రస్తావించకుండానే ఖుష్బూ సైలెంట్ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ విధంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆమె సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఖుష్బూ పరోక్షంగా కౌంటర్ ఇవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెకు డైరెక్ట్ గా థ్యాంక్స్ చెబుతున్నారు. నీకే కౌంటార్ అంటూ ఖుష్బూ సుందర్ ట్వీట్ లో మీరా చోప్రాను ట్యాగ్ చేస్తున్నారు. మరి ఖుష్బూ ట్వీట్ పై మీరా చోప్రా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Loading...