ఎమోషన్స్ తోనే శృంగారంలో ఎంజాయ్ : ఇలియానా

902
sex but there has to be some amount of emotion : ileana dcruz
sex but there has to be some amount of emotion : ileana dcruz

గోవా బ్యూటీ ఇలియానా.. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగింది. ఇక్కడ నుంచి బాలీవుడ్ చెక్కేసి అక్కడ ఎక్కువ సినిమాలు చేస్తోంది. పోయిన ఏడాడి అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో మళ్లీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చిన పెద్దగా కలిసి రాలేదు. ఈమె ప్రస్తుతం ’పాగల్‍పంతి’ అనే బాలీవుడ్ మూవీలో చేస్తోంది. అనీల్ కపూర్, జాన్ అబ్రహం ఈ సినిమాలో హీరోలుగా చేస్తున్నారు. నవంబర్ 22న రిలీజ్ కానుంది.

ఇక విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో చాలా కాలంపాటు డేటింగ్ చేసిన ఇలియానా.. ఇటివలే అతనికి బ్రేకప్ చెప్పింది. కానీ అతనితో ఏకాంతంగా గడిపిన క్షణాలు మాత్రం అసలు మర్చిపోవడం లేదు. తాజాగా ఆమె ’ది లవ్, లాఫ్, లైవ్ షో’ లో పాల్గొంది. అక్కడ సింగర్ శిబానీ దండేకర్ తో ముచ్చటించింది. ఈ సందర్భంగా శృగారం గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది ఈ గోవా బ్యూటీ. “శృంగారంకి లవ్ కి లింక్ లేదు’ అని గతంలో ఇలియానా అన్నట్లు వచ్చిన వార్తల గురించి శిబాని అడగగా.. ఇద్దరి మధ్య కాస్త ఎమోషన్స్ అంటూ ఉంటానే శృంగారం ఎంజాయ్ చేయగాలమని ఇలియానా చెప్పింది.

అసలు తాను గతంలో చెప్పిన మాటలను తప్పిగా అర్దం చేసుకున్నారని పేర్కొంది. “నేను శృంగారంను బాగా ఎంజాయ్ చేస్తున్నానని.. శృంగారంను వర్కౌంట్‍లా చేస్తున్నానని నేనే స్వయంగా చెప్పినట్లు ఎవరో రాశారు. కానీ అది తప్పు. కొన్ని ఎమోషన్స్ అంటూ ఉంటానే శృంగారం ఎంజాయ్ చేయగలరు. మీరు ప్రేమలో ఉంటే శృంగారం అనేది అత్యద్బుతంగా ఉంటుంది. లేకుంటే రెండు ఆత్మల కలయిక శృంగారం’ అని ఇలియానా చెప్పుకొచ్చింది.

Loading...