Friday, March 29, 2024
- Advertisement -

జై జ‌గ‌న్ అంటున్న ప‌వ‌న్ భ‌క్తుడు

- Advertisement -

ష‌క‌ల‌క శంక‌ర్ జ‌బ‌ర్థ‌స్త్ ప్రొగ్రామ్‌లో క‌మెడియ‌న్‌గా ఎంట్రీ ఇచ్చాడు. త‌క్కువ కాలంలోనే ఆ ప్రొగ్రామ్‌లో టీం లీడ‌ర్ కూడా అయ్యాడు. మ‌నోడి టాలెంట్ చూసి సినిమాల‌లో వ‌ర‌స అవ‌కాశాలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం వ‌స్తున్న అన్ని చిన్న సినిమాల‌లో ష‌క‌ల‌క శంక‌ర్ ఉంటున్నాడు. అయితే తాజాగా ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా మారి ఓ సినిమా తీశాడు. శంభో శంక‌ర అనే సినిమాతో గ‌త‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈటీవీలో అలీ నిర్వ‌హించే అలీతో స‌ర‌దాగా అనే ప్రొగ్రామ్‌కు శంక‌ర్ అతిథిగా వ‌చ్చాడు.

మాములుగానే శంక‌ర్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ అభిమాని అన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌ని దేవుడిలా భావిస్తాడు శంక‌ర్. మ‌రి అలాంటి శంక‌ర్ ఈ టీవీ ప్రొగ్రామ్‌లో జైజ‌గ‌న్ అన‌డం అంద‌రికి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. జైజ‌గ‌న్ అనే మాట‌ను మ్యూట్ చేసిన‌ప్ప‌టికి ఆ ప‌దం అంద‌రికి అర్థం అవుతుంది.cజ‌బ‌ర్థ‌స్త్ వాళ్లు ప‌వ‌న్ జ‌పం చేస్తు కాలం గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి ష‌క‌లక శంక‌ర్ జైజ‌గ‌న్ అన‌డంపై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కొద్ది రోజుల క్రిత‌మే శంక‌ర్‌ని టాలీవుడ్ సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి చెప్ప‌కూడ‌ని మాట‌ల‌తో తిట్టింది. టాలీవుడ్‌లో క‌మెడియ‌న్‌గా ఎదుగుతున్న శంక‌ర్ ఇలా ప్ర‌వ‌ర్తిస్తే కొద్ది రోజుల‌కే క‌నుమ‌రుగు అవ్వ‌డం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -