Friday, March 29, 2024
- Advertisement -

షకీలా బయోపిక్ ఇక్కడ ఒకలా, అక్కడ ఇంకోలా…

- Advertisement -

ప్రస్తుతం బయోపిక్ల ట్రెండు బాగానే నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బయోపిక్ షకీలా. టైటిల్కు తగ్గట్టు గానే ఒకప్పటి పోర్న్ స్టార్ షకీలా ఎలా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనుంది. బాలీవుడ్ బ్యూటీ రిచా చెడ్డా ఈ సినిమాలో షకీలా పాత్రలో కనిపించబోతోంది. ఇంద్రజిత్ లంకేష్ ఈ చిత్రానికి దర్శకత్వం. తాజా సమాచారం ఈ సినిమా భారతదేశంలో ఒక వెర్షన్ ఓవర్సీస్ లో మరొక వెర్షన్ విడుదల కాబోతోందట. భారతదేశంలో విడుదల అవ్వబోతున్న సినిమాలో పాటలు, డాన్సులు కూడా ఉంటాయట.

కానీ ఓవర్సీస్ లో విడుదల కాబోయే సినిమాలో మాత్రం ఇలాంటి అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కథ మాత్రమే ఉంటుందట. ‘లాగాన్’ మరియు ‘దంగల్’ వంటి చిత్రాలకు ఎడిటింగ్ చేసిన బల్లు సలుజ ఇంటర్నేషనల్ వెర్షన్ కి కూడా ఎడిటింగ్ చేయబోతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఆగస్టులో విడుదల అవుతుంది. ఒకేసారి భారతదేశం మరియు ఓవర్సీస్ లో ఈ సినిమా థియేటర్లలో కి రానుంది. ముందుగా ఈ చిత్రం హిందీలో విడుదల అవుతుంది. తరువాత తెలుగు మరియు మలయాళ భాషల్లో డబ్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -