Friday, April 19, 2024
- Advertisement -

ఏపీ మూడు రాజధానులు.. షకీలా పంచ్..!

- Advertisement -

షకీలా అంటే తెలియని వారు ఉండరు. కానీ ఆమె ఒకప్పుడు చాలా బిజీ స్టార్. దక్షినాదిని ఊపేసిన పోర్న్ స్టార్. ఇప్పుడు సన్ని లీయోన్ ఎలానో అప్పుడు షకీయాలా అంతే. ఇలాంటి పోర్న్ స్టార్ కుటుంబ కథా సినిమా తీస్తే ఎలా ఉంటుంది ? వామ్మో ఊహించుకోవడానికే అదోలా ఉంది కదా ? కానీ ఇది నిజం. షకీలా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’ మూవీ తాజాగా టీజర్ విడుదలైంది.

వీఎన్ సతీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సతీష్ నిర్మిస్తున్నారు. ఈ టీజర్ లో ఏపీ సీఎం జగన్ పై షకీలా పంచ్ వేయడం సంచలనంగా మారింది. ఇటీవలే ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. చర్చనీయాంశంగా మారిన ఈ టాపిక్ నే షకీలా మూవీ టీజర్ లో ప్రస్తావించి ఎద్దేవా చేయడం విశేషం. ఈ టీజర్లో ’ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు’ అని పేపర్ లో వార్తను చదివి షకీలా ఆశ్చర్యపోతుంది.

‘ఆంధ్రాకి మూడు రాజధానులేంటి?’ అని అసిస్టెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిని ప్రశ్నిస్తుంది. దీనికి అసిస్టెంట్ .. జగన్ అన్న మూడు రాజధానులు చేసేశాడుగా’ అని సమాధానిమిస్తాడు. ఇందుకు షకీలా పంచ్ వేస్తూ.. ’ఒక్క స్టేట్ కే మూడు రాజధానులా? పోను పోను ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్య పోనవసరం లేదు’ అని పంచ్ వేశారు. దాంతో ఈ టీజర్ వైరల్ అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -