శంకర్ అందుకు ఒప్పుకుంటాడా..?

626
shankr opinion in gentle man part 2
shankr opinion in gentle man part 2

యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన జెంటిల్ మెన్ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పనవసరం లేదు.. ఇండియా మెచ్చిన దర్శకుడు శంకర్ ఈ సినిమా తోనే సినిమా ఇండస్ట్రీ కి పరిచయమవగా ఆ తర్వాత ఆయన నుంచి ఎలాంటి సినిమాలు వచ్చాయో అందరికి తెలిసిందే. దొంగతనం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అర్జున్ కెరీర్ కి ఎంతగానో హెల్ప్ అయిన అవగా, నిర్మాత కెటి కుంజు మోన్ ఒక కొత్త దర్శకుడితో , అప్పుడే డౌన్ అవుతున్న అర్జున్ తో ఇలాంటి భారీ యాక్షన్ చిత్రాన్ని చేసి గట్టి రిస్క్ చేశాడని చెప్పొచ్చు.. ఈ సినిమాలో పోలీసులను తప్పించుకుంటూ అర్జున్ చేసే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచాయి..

ఇక ఈ సినిమా కి సంగీతం అందించిన ఎఆర్ రెహ్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అప్పటికే ఈ నిర్మాత ద్వారా ప్రేమికుడు, ప్రేమదేశం వంటి సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు.. ఇంకేముంది అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా సంగీత పరంగా సూపర్ హిట్ అయ్యింది.. ఇక ఈ నిర్మాత ఆ తర్వాత తన కొడుకు తో ఓ భారీ సినిమాని ప్లాం చేసినా అది వర్కౌట్ అవక వ్యాపారాల్లో బిజీ అయిపోయాడు..

ఇక తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్ లో సంచలనం గా మారింది. ఇటీవలే ఆయన జెంటిల్ మెన్కి పార్ట్ 2 తీస్తానని చెప్పి అందరిలో ఆసక్తి రేకెత్తించాడు.  ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా దీనికి కొనసాగింపు ఉంటుందని చెప్పడంతో అభిమానుల్లో ఉత్సుకత మొదలైంది. అయితే ఈ సినిమాలో అర్జున్ ఉంటాడా లేక మరో హీరో ఏవరయినా ఉంటారా అనేది చూడాలి.. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేసే ఈ నిర్మాత ఓ కొత్త దర్శకుడి తో సినిమా చేశారని అంటున్నారు.. దర్శకుడు శంకర్ కి ఇప్పుడు బాడ్ టైం నడుస్తుందని చెప్పాలి.. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన భారతీయుడు సినిమా సీక్వెల్ సరిగ్గా జరగడం లేదు.. దాంతో తనకు పార్ట్ 2 లు, రీమేక్ లు అచ్చి రావడం లేదని అయన సన్నిథితులతో చర్చిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కి దర్శకుడిగా ఎవరుంటారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది..

Loading...