రణరంగానికి తెరలేపుతున్న శర్వానంద్

321
Sharwanand Sudheer varma Movie Titled Ranarangam
Sharwanand Sudheer varma Movie Titled Ranarangam

శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వం లో వస్తున్న చిత్రం కోసం ఆత్రుత గా ఎదురు చూస్తున్న సంగతి మనకి తెలిసిందే, అయితే ఆయన ఇప్పటికే ఒక ఫ్లాప్ ఇచ్చినందుకు బాధ పడుతూ ఇక వచ్చే తదుపరి చిత్రం విషయం లో అయినా జాగ్రత్తగా ఉండాలి అనే ఉదేశ్యం తో ఉన్నాడట. ఈ సినిమా కోసం ఇప్పటికే చాలా సమయం వెచ్చించిన శర్వా ఔట్పుట్ తో హాపీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సినిమా యూనిట్ ఇప్పటికే సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. సినిమా కి సంబంధించి రకరకాల టైటిల్స్ మీడియా లో వినిపిస్తున్నా కానీ ఇప్పటి వరకు వాటి మీద మనకి ఒక క్లారిటీ రాలేదు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమా కి రణరంగం అనే టైటిల్ ని ఖరారు చేశారట చిత్ర యూనిట్. ఈ సినిమా లో శర్వానంద్ పాత్ర అందరినీ విపరీతం గా ఆకట్టుకొనే లా ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒక గ్యాంగ్స్టర్ గా శర్వానంద్ నటన ఈ సినిమా కి ప్రధాన ఆకర్షణ అని తెలుస్తుంది. సినిమా కి సంబందించిన వివరాలు అధికారికం గా చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేయనున్నారు. ఈ సినిమా లో కల్యాణి ప్రియదర్శన్ మరియు కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు.

Loading...