Friday, March 29, 2024
- Advertisement -

శర్వానంద్ కి కన్నుకొడుతున్న కళ్యాణి ప్రియదర్శన్

- Advertisement -

ఈమధ్యనే ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో మరొక డిజాస్టర్ ను అందుకున్న యువ హీరో శర్వానంద్ ఇప్పుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రణరంగం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమాలోని మొదటి పాట ‘కల్యాణ వైభోగమే’ లో శర్వానంద్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ ల పెళ్లి విజువల్స్ ను చూపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ‘కన్నుకొట్టి చూసెనంట సుందరి’ అనే రెండవ లిరికల్ వీడియో ని విడుదల చేశారు దర్శక నిర్మాతలు.

కల్యాణి ప్రియదర్శన్ శర్వానంద్ కి కన్ను కొట్టడంతో మొదలయ్యే ఈ లిరికల్ వీడియో లో శర్వా, కల్యాణీ ప్రియదర్శన్ ల మధ్య కొన్ని అందమైన సన్నివేశాలను మరియు స్టిల్స్ ను చూపించారు. ఈ సినిమాకి కార్తిక్ రోడ్రిగీజ్ చక్కని సంగీతం అందించారు అని పాటలు వింటుంటే నే అర్థమైపోతోంది. అతని గొంతు కూడా పాటకి చాలా బాగా సెట్ అయింది. కృష్ణ చైతన్య రాసిన లిరిక్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -