Friday, March 29, 2024
- Advertisement -

‘రణరంగం’ మరియు ‘గాడ్ ఫాదర్’ సినిమాల కి మధ్య సంబంధం ఏంటి ?

- Advertisement -

ఈ మధ్యనే ‘పడి పడి లేచే మనసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న యువ హీరో శర్వానంద్ ఇప్పుడు ‘రణరంగం’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్నమొన్నటిదాకా విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వని దర్శకనిర్మాతలు ‘సాహో’ సినిమా వాయిదా పడటంతో వెంటనే ఆగస్టు 15 తేదీని తమ విడుదల తేదీగా ఖరారు చేసారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ సినిమాకి మరియు ‘గాడ్ ఫాదర్’ సినిమా కి మధ్య ఏదో ఒక కనెక్షన్ ఉందట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శకుడు సుధీర్ వర్మ ఈ విషయాన్ని తెలిపారు. ‘రణరంగం’ సినిమా లో తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ వంటి అంశాలు ఉన్నాయని అలాగే ‘గాడ్ ఫాదర్’ సినిమాలో లాగా ఒక గ్రిప్పింగ్ కథ కూడా ఉందని ఆయన అన్నారు. అంతే కాకుండా ఈ సినిమా గాడ్ ఫాదర్ సినిమా ఇన్స్పిరేషన్ అని తెలియజేశాడు సుధీర్ వర్మ. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ పిళ్ళై సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఈ సినిమాతో శర్వానంద్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -