Saturday, April 20, 2024
- Advertisement -

స్టార్ హీరోయిన్ విడాకుల‌కు రెడీ అయిందా..?

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి విడాకులు తీసుకోనుంద‌నే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో శిల్పాశెట్టి కూడా ఒక‌రు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ సినిమాల్లో కూడా ఈ పొడుగు కాళ్ల సుంద‌రి న‌టించింది. తాజాగా ఆమె విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆమె స‌న్నిహితుల‌తోపాటు అభిమానులు కూడా ఆందోళన చెందారు. శిల్పాశెట్టి రాజ్ కుంద్రా అనే బిజినేస్‌మేన్‌ని ప్రేమించి మ‌రి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి అయి దాదాపు 11 సంవ‌త్స‌రాలు కావ‌స్తోంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నారు. అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని తెలిపింది శిల్పాశెట్టి. శిల్పా, అనురాగ్ బసు, గీతా కపూర్ లు ‘సూపర్ డాన్స్ 3’ అనే రియాలిటీ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

అనురాగ్ బసు శిల్పాశెట్టి ఫోన్ నుంచి ఆమెకు తెలియ‌కుండా స‌ర‌దాగా ఓ మేసేజ్ చేశాడ‌ట‌. ఇంత‌కి ఆ మేసేజ్ సారాంశం ఏంటంటే ‘నేను, రాజ్ కుంద్రా విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం’ అంటూ ఆమె తల్లి సునంద శెట్టికి మేసేజ్‌ పంపారట‌. దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు కంగారుప‌డిపోయార‌ట‌. శిల్పాశెట్టికి త‌ల్లి సునంద శెట్టి ఫోన్ చేసి ఇదంతా నిజమేనా అని అడిగారట‌. అదేం లేదని, జోక్ చేశారని.. ఇలాంటి విషయాలు నాకు నేనుగా ఇంటికి వచ్చి చెప్పే వరకు నమ్మొద్దని చెప్పిందట శిల్పాశెట్టి. పెళ్లి త‌రువాత కూడా త‌న ఫిజిక్‌ను మెయిన్‌టైన్ చేయ‌డంలో బిజీగా ఉంటుంది. 40 ఏళ్ల వ‌య‌స్సులో కూడా 20 ఏళ్ల హీరోయిన్‌లా ఉంటుంది శిల్పాశెట్టి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -