Friday, March 29, 2024
- Advertisement -

శ్రీముఖిని తిట్టేసిన శివజ్యోతి.. ఎందుకు ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ఈ వారంతో ముగింపు పలకనుంది. ఈ సారి విజేత ఎవరు అని ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. గతవారం శివజ్యోతి ఎలిమినేట్ అయింది. కాగా ఇప్పుడు హౌస్ లో శ్రీముఖి, రాహుల్, అలీ, వరుణ్, బాబా భాస్కర్ లు ఉన్నారు. వీరిలో ఎవరు విన్నర్ కాబోతున్నారు అనేది వేచి చూడాలి.

ఇక తాజాగా శివజ్యోతి ఎలిమినేట్ తర్వాత పలు మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆమె బిగ్ బాస్ లో ఇన్ని రోజులు ఉంటుందని ఎవరూ ఉహించలేదు. రెండు మూడు వారాల్లోనే బయటకు వస్తుందని అనుకున్నారు కానీ 14 వారాల పాటు బిగ్ బాస్-3లో ఉండి ఎంతో మంది అభిమానులను సంపాధించుకుంది. అయితే ఎలిమినేట్ అయినందుకు బాధ ఏమిలేదని..శివజ్యోతి తెలిపింది. నిజానికి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పుడు చాలా బాధపడ్డాను. అందర్ని వదిలేసి వెళ్తున్నాను. ఉండగలనా లేదా అన్న అనుమానం ఉండేది. కానీ ధైర్యం చేసి వెళ్లాను.

తర్వాత హౌస్ లో అందరు కుటుంబ సభ్యుల కలిసిపోయారు. ఇక హౌస్ లో ఎవరు గెలిచిన నాకు పర్వాలేదని చెప్పింది. ఇక ఫైనల్ పార్టిసిపెంట్స్ గురించి ఒక్క మాటలో చెప్పిన శివజ్యోతి.. శ్రీముఖిని మాత్రం తిట్టేసింది. లౌడ్ స్పీకర్, కోతి, పంది అన్ని అదే అంటూ బూతులు తిట్టింది. శ్రీముఖి నాకంటే పెద్ద కౌడ్ స్ఫీకర్ అని చెప్పింది. మహేష్ విట్టా దొంగ బ్రదర్.. పునర్నవి, అషు రెడ్డి మంచి స్నేహితులని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -