Thursday, March 28, 2024
- Advertisement -

శివాజీ మరో కొత్త పురాణం

- Advertisement -

గరుడ పురాణం ఫెయిల్యూర్ తో మరో కొత్త పురాణాన్ని తెరపైకి తేవటం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కుట్రల శివాజీ మరో ప్రయత్నం చేస్తున్నారా…? దీని వెనుక పచ్చ పార్టీ ఉందా…? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన పొరపాట్లు అవినీతిని రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజకు తెలియ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్ట పాలు చేయటంతో పాటు సొంత రాష్ట్రానికి ఎంతో కొంత సాయం చేద్దామనే ఉద్దేశ్యంతో తక్కువ రేటుకు పోలవరం టెండర్‌ దాఖలు చేసిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థపై లేనిపోని కట్టుకధల ద్వారా బురద చల్లి బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అన్ని వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. గత సాధారణ ఎన్నికలకు ముందు గరుడ పురానం, ఆపరేషన్‌ ద్రవిడ వంటి వాటితో తెగ హడావుడి చేసినా శివాజీకి ఆశించిన ఫలితం లభించలేదు.ఆయన చెప్పిన గరుడ పురాణాన్ని ఎవ్వరూ నమ్మలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకున్న శివాజీ ఈసారి మాత్రం మేఘా ఇంజనీరింగ్‌ను లక్ష్యంగా చేసుకుని పురాణాలు చెప్పటం ఆరంభించారు. ఈ పురాణాల వెనుక రాజకీయ ప్రయోజనాలు, ముఖ్యంగా ఒకవర్గం ప్రయోజనాలు ఉన్నాయనే భావన వ్యక్తం అవుతోంది. గతంలో శివాజీ చెప్పిన గరుడ పురాణాన్ని ఆశక్తిగా గమనించిన రాజకీయ నేతలు, విశ్లేషకులు, ప్రజలు ఈసారి ఆయన చెప్పిన దానిలో దేనిలో వాస్తవం ఉండదని తొలి ఎపిసోడ్‌తోనే ఓ నిర్ణయానికి వచ్చేశారు. గతంలో ఓ టీవీ ఛానల్లో ‌ ఓ వెలుగు వెలిగి, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొని ఆ తరువాత అరెస్టు అంచుకు వెళ్లి వచ్చిన ఆర్‌పీతో పాటు గరుడ శివాజీ తమ సామాజిక రాజకీయ అవసరాల కోసం పచ్చదండు చెప్పినట్లు చేయటం కొత్త ఏమీ కాదని రాజకీయ వర్గాల అంచనా.

తెలుగుదేశం పేమెంట్‌తో గరుడ, ద్రవిడ కుట్రలకు శివాజీ తెరలేపారని అప్పటి పురపాక శాఖ మంత్రి నారాయణ వ్యక్తిగత సిబ్బంది టెలీఫోన్‌ సంభాషణల్లో అంగీకరించారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. గరుడ శివాజీకి రూ. 10 కోట్లు పేమెంట్‌ చేశామని వారు బహిరంగంగానే ఆ ఆడియోల్లో చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ఠ రోజు రోజుకూ దిగజారుతుండటంతో 2018 మార్చిలో గరుడ పురణానికి తెరలేపిన శివాజీ అండ్‌కో ఏడాదిపాటు దాన్ని సాగదీసింది. చంద్రబాబుపై సిబిఐ కేసు నమోదు చేస్తుందని, రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరుగుతుందని శివాజీ చెప్పారు. ఆయన చెప్పినట్లు చంద్రబాబుపై ఇప్పటి వరకూ సీబీఐ కేసు నమోదు చేయలేదు. ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేదు. గత ఎన్నిక్ల ఘోర ఓటమి చవి చూసిన చంద్రబాబు కేంద్రంలోని బీజేపీతో అంతకు ముందు ఆరునెలపాటు పోరాటం చేసినట్లు హడావిడి చేసి చివరకు వారితోనే కాళ్లబేరానికి వచ్చారు. అందులో భాగంగానే తన పార్టీ రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని బీజేపీ ఒకపక్క చెబుతూనే మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణనే వల్లే వేస్తున్నారు. తాజాగా ఆ బాధ్యతను కుట్ర శివాజీ మరో పురాణం పేరుతో ప్రచారం చేసేందుకు సిద్ధం అయ్యారు. సాధారణ ప్రజలు ప్రభుత్వంపై నాలుగు ముక్కలు గట్టిగా మాట్లాడితే వ్యతిరేక మీడియా తెగ హడావిడి చేస్తుంది. అప్పట్లో చంద్రబాబుకు అనుకూలముగా పచ్చ మీడియా ఉండేది కాబట్టి ఎపుడో శెలబ్రిటీనని చెప్పుకునే శివాజీ చెప్పింది చెప్పినట్లు ప్రచురణ, ప్రసారం చేసేవి పచ్చ మీడియా యాజమాన్యాులు . అయితే దాని వల్ల పచ్చ పార్టీ అధినేతకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఈ పురాణాన్నే చంద్రబాబు అందుకున్నా ఎలాంటి ఫలితం రాలేదు.ఇదే గరుడ పురాణంలో శివాజీ చెప్పినట్లు ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగింది. అయితే ఆ తరువాత ఎలాంటి అల్లర్లు జరగలేదు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేయలేదు. రాష్ట్రపతి పాలన పెట్టలేదు. అయితే గరుడ శివాజీ మాటలు మాత్రం కాశీ మజిలీ , బేతాళకధలు, మాయల ఫకీర్‌ నాటకాలు, పిట్టల దొర మాటలు, హరికథా కాలక్షేపం, జానపథ చిత్రాలుగా మిగిలిపోయాయి. గతంలో బీజేపీ నేతలను అంటరాని వాళ్లుగా చూసిన పచ్చ మీడియా ఇపుడు మాత్రం చంద్రబాబుతో వారు సఖ్యతగా ఉండటం చూసి ఇపుడు తెగ ప్రాధాన్యతనిస్తున్నారు. బీజేపీతో జగన్‌కు సఖ్యత లేదని చెప్పేందుకు టీడీపీ నేతలు ఇటీవల ఇద్దరు సీఎంల మీటింగ్‌పై లీక్‌ చేసిన ఓ వార్తను పచ్చ పత్రికలు ప్రధాన శీర్షికగా ప్రచురించి ఆ తరువాత ఖండనను వేసుకున్నాయి.

టీవీ9 ఛానల్‌ చేతులు మారాక దాని మాతృ సంస్థ అసోసియేటెడ్‌ బ్రాట్‌ కాస్టింగ్‌ కంపెనీ లిమిటెడ్‌(ఏబీసీఎల్‌)కు ఇబ్బందులు సృష్టించాలని రవిప్రకాష్‌, గరుడ శివాజీ కుట్రలకు తెరలేపిన విషయం తెలిసిందే. వీరిద్దరూ పాత తేదీతో షేర్ల అమ్మక ఒప్పందం చేసుకున్నారని, ఎన్‌సీఎల్‌టీలో కేసు వేసేందుకే ఇలా చేశారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తేల్చారు. ఈ కేసును ఎన్‌సీఎల్‌టీ కొట్టి వేసింది కూడా. ఇలాంటి చరిత్ర కలిగిన శివాజీ మళ్లీ పచ్చ దండు ప్రోద్బలంతో వీడియో క్లిప్‌ను విడుదల చేయటం బుధవారం రాత్రి నుంచి స్టార్ట్‌ చేశారు. తాను వారం వారం కొన్ని వాస్తవాలను గరుడ పురాణం మాదిరిగా వదిలి పెడతానని టీజర్‌ వదిలారు. ఈ టీజర్‌ను పచ్చదండు విపరీతంగా ట్రోల్‌ చేస్తుండటాన్ని బట్టి దీని వెనుక ఎవరున్నారో అర్థం అవుతోంది. గరుడ పురాణం సమయంలోనే కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నికకు వెళితే రెండంకెకు మించి సీట్లు రావని చెప్పారు. ఈ మాట కూడా చంద్రబాబు ప్రోద్భంతోనే ఆయన చెప్పారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రజలు కూడా అదే మాదిరిగా తీర్పు చెప్పారు. ఆ తరువాత దాదాపు మీడియాకు దూరంగా పురాణాలు చెప్పకుండా ఉంటున్న కుట్రల శివాజీ తాజాగా పచ్చ పార్టీ ప్రోద్బలంతో రంగంలోకి దిగారు.

కాచే చెట్టుకు రాళ్ల దెబ్బలు అన్నట్లు ఏపీలో హంద్రీ నీవా, పట్టిసీమ, తెంగాణలో కాళేస్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తున్న మేఘా ఇంజనీరంగ్‌కు ఏపీ ప్రభుత్వం అనుచిత లబ్ధి చేకూరుస్తోందని టీడీపీ నేతలు విమర్శులు ప్రారంభించారు. వాటికి కుట్ర శివాజీ వంత పాడటం ప్రారంభించారు. దేశ వ్యాపితంగా బ్యాటరీ బస్సు కొనుగోలుకు కేటాయించిన మూడున్నర వేల కోట్లకు రెట్టింపు మొత్తాన్ని ఏపీలోనే ఒక కుంభకోణంగా చూపేందుకు పచ్చ పార్టీ, వారి మీడియా ప్రయత్నిస్తుంటే సినిమాల్లో పాత్రలు లేని శివాజీ నేనూ ఓ పాత్ర పోషిస్తానని అందులో చేరారు. గతం కంటే రూ. 628 కోట్ల తక్కువకు మేఘా ఇంజనీరింగ్‌ పోవరం ప్రాజెక్టు కు టెండరు దాఖలు చేయటమే ఈ విమర్శకు కారణమని అందరికీ తెలిసిందే. బ్యాటరీ బస్సును కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే కొనుగోలు చేస్తారు తప్ప రాష్ట్రం పాత్ర ఇందులో ఏమీ ఉండదని 40 ఇయర్స్‌ ఇండస్ట్రీతో పాటు పురాణా శివాజీకీ తెలిసిన విషయమే. అయినా వారు విమర్శ విషయంలో మాత్రం తగ్గటం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -