Thursday, April 25, 2024
- Advertisement -

సాహో సినిమా కోసం శ్రద్ధ కపూర్ తీసుకున్న రెమ్యూనరేషన్

- Advertisement -

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న శ్రద్ధకపూర్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం కాబోతోంది. ఈ సినిమాలో క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృత నాయర్ పాత్రలో శ్రద్ధ కపూర్ నటన అద్భుతంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు ఈమె కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటుందని ఇప్పటికే టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ సినిమా కోసం శ్రద్ధ కపూర్ తీసుకున్న రెమ్యూనరేషన్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

యూవీ క్రియేషన్స్ వారు ‘సాహో’ సినిమాని మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఈ సినిమా కోసం శ్రద్ధ కపూర్ 7కోట్లు తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సాహో సినిమా కోసం శ్రద్ధ కపూర్ కేవలం మూడు కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుందని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజా నిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -