హీరోయిన్ శోభన ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా ?

792
Shocking story behind why actress shobana didn't married yet
Shocking story behind why actress shobana didn't married yet

సీనియర్ హీరోయిన్ శోభన గురించి తెలియని వారు ఉండరు. ఆమె 1984 లో సుమన్ హీరోగా వచ్చిన ‘శ్రీమతి కనుక’ చిత్రంతో తెలుగులో పరిచమైంది. ఆ తర్వాత వెంకటేష్ తో ‘అజేయుడు’, ‘త్రిమూర్తులు’ వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత చిరంజీవితో ‘రుద్రవీణ’, బాలకృష్ణ తో ‘మువ్వగోపాలుడు’, నాగార్జునతో ‘విక్రమ్’ వంటి చిత్రాల్లో నటించింది.

మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్ వంటి అప్పటి టాప్ హీరోల సినిమాల్లో కూడా ఈమె నటించింది. ఇంకా మరెన్నో అద్భుతమైన సినిమాల్లో నటించింది శోభన. అయితే ఈమెకు భారత నాట్యంలో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. ఇప్పటికీ ఎన్నో ప్రదర్శనలు ఇస్తూనే ఉంది. మలయాళం నటి అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈమె వయసు 50 ఏళ్ళకు దగ్గర పడుతున్నప్పటికీ ఇంకా పెళ్ళి చేసుకోకపోవడం గమనార్హం. అందుకు కారణం ఉందట. ఓ మలయాళ హీరోని ప్రేమించిందట.

కానీ అతను ఈమెకు హ్యాండివ్వడంతో ఇప్పటి వరకూ పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయినట్టు తెలుస్తోంది.పెళ్లి, ప్రేమకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిందట. అయితే ఒంటరిగా ఉండటం ఇష్టం లేక.. ఓ పాపను దత్తత తీసుకుని.. ఆమె ఆలనా.. పాలనా చూసుకుంటుంది. ఇది ఇలా ఉంటే సినిమాలకు దూరంగా ఉంటున్న శోభన.. ఇటీవల వచ్చిన దుల్కర్ సల్మాన్ ‘వారనే ఆవశ్యముందే’ అనే చిత్రంలో నటించింది.

Loading...