Friday, April 26, 2024
- Advertisement -

వేశ్య పాత్రలో శ్రద్ధా!

- Advertisement -

శ్రద్ధాదాస్ తెలుగు ఇండ‌స్ట్రీ ప‌రిచియ‌మై చాలాకాల‌మైనా స‌రైన హిట్ ఇప్ప‌టికి వ‌ర‌కు ప‌డ‌లేదు.10 సంవ‌త్స‌రాల క్రితం వ‌చ్చిన ‘సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది నటి శ్రద్ధాదాస్. తెలుగులో ఆర్య2. డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదని చెప్పాలి. ఇక తెలుగుతో పాటు హింది,త‌మిళ్ భాష‌ల‌లో సినిమాలు చేస్తున్న హిట్ మాత్రం రావ‌డం లేదు.ఇలా అయితే లాభం లేదు అనుకుని శృంగార భ‌రిత చిత్రాల‌లో కూడా న‌టించ‌డానికి రెడీ అయింది.

తాజాగా ఈ బ్యూటీ ‘శృంగార దాన్’ అనే షార్ట్ ఫిల్మ్ లో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించాబోతుందని తెలుస్తోంది.90ల కాలం నాటి వాస్తవ జీవితాల ఆధారంగా ఈ లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఒక వేశ్య మధ్య వయస్కుడైన ఒక వ్యక్తిని ప్రేమించే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఇందులో శ్రద్ధా లుక్ ఎలా ఉండబోతుందో అభిమానులతో పంచుకుంది ఈ బ్యూటీ.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -