Wednesday, April 24, 2024
- Advertisement -

వామ్మో.. జెర్సీ హీరోయిన్ అంత మాట అనేసిందేంటి?

- Advertisement -

నాని హీరో గా విడుదల అయ్యి హిట్ అయిన చిత్రం జెర్సీ. ఈ సినిమా తో తెలుగు తెర కి పరిచయం అయిన హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్. అయితే ఈ సినిమాలో గ్లామరస్ పాత్ర కాకుండా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేయడం తో శ్రద్ద కి మంచి పేరు వచ్చింది. అయితే శ్రద్ధ కూడా అలాంటి పాత్రలే చేయాలని ఇండస్ట్రీ కి వచ్చింది. తానొక హీరోయిన్ మెటీరియల్ కాదు అని అంత తొందరగా హీరోయిన్లు ఎవరూ చెప్పారు కానీ శ్రద్ధ ఆ మాట అనేసింది. అయితే సాధారణం గా విమర్శకులు అలాంటి కామెంట్స్ చేస్తారు కానీ ఒక హీరోయిన్ చెప్పడం ఆశ్చర్యకరం.

“అవును నేను హీరోయిన్ ని కాదు. హీరోయిన్ మెటీరియల్ కాదు. నేనొక నటి ని. నేను గ్లామరస్ డాల్ ని కాదు. సినిమాలని కేవలం గ్లామర్ కోసమే చేయను నేను.” అని శ్రద్ద కుండా బద్దలు కొట్టేసినట్టు చెప్పింది. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తున్నాయి. అయితే శ్రద్ద కి ఇంత యాటిట్యూడ్ ఏంటి అని కొందరు మాట్లాడుతున్నారు.

ఇది పక్కన పెడితే శ్రద్ద త్వరలో ఆది సాయి కుమార్ సరసన జోడి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -