Friday, March 29, 2024
- Advertisement -

మరో వివాదం తో మన ముందుకు వస్తున్న సిద్దార్థ్

- Advertisement -

ప్రస్తుతం భారత దేశ చిత్ర పరిశ్రమ లో ఎంటర్టైన్మెంట్ కి మరో పేరు గా మారింది డిజిటల్ మీడియా ప్లాట్ఫారం. చాలా మంది జనాలు థియేటర్లకు రావడం తగ్గించడం కి గల కారణం ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫారం అభివృధి చెందడమే. ప్రపంచం లోనే ఎక్కడా లేని విధంగా మన భారత దేశం లోని ప్రేక్షకులు ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫారం కి బాగా అలవాటు పడిన సంగతి మనకి తెలిసిందే. పెద్ద పెద్ద సినిమాలు చేసే నిర్మాణ సంస్థలు, నటులు కూడా ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫారం మీద వెబ్ సిరీస్ లు చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా వచ్చిన వారిలో సిద్ధార్థ్ కూడా ఒకడు. ప్రస్తుతం సిద్ధార్థ్ ముఖ్య పాత్ర లో లైలా అనె ఒక వెబ్ సేరీస్ రానున్నది.

ఈ వెబ్ సీరీస్ కి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలై న నేపథ్యంలో అందరి చూపు ఈ వెబ్ సీరీస్ మీద పడింది. ఆర్య వ్రత అనే ఒక మతానికి చెందిన కథ కి సంబంధించినది ఈ వెబ్ సీరీస్ ప్రయాగ అక్బర్ రాసిన లైలా అనే పుస్తకం పైన బేస్ చేసుకొని తీయబడినది. అయితే ఈ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి సోషల్ మీడియా లో ఇదొక పెద్ద వివాదాన్ని రేపబోతోంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందులోనూ వివాదాలకు ఎప్పుడు దెగ్గరగా ఉండే సిద్ధార్థ్ ఈ వెబ్ సీరీస్ లో ఒక ముఖ్య పాత్ర చేస్తుండడం ఇంకా ఆసక్తి కలిగించే విషయం. రానున్న రోజుల్లో దీని పై ప్రేక్షకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి ఉండాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -