చిన్మయి, సమంత కలిసి ఏం చేస్తున్నారో తెలుసా…

318
Chinmayi and Samantha Sharing Same Stage
Chinmayi and Samantha Sharing Same Stage

గత కొంత కాలం గా కబీర్ సింగ్ సినిమా మీద విపరీతం గా కామెంట్స్ చేస్తున్నారు కొంత మంది. ఫెమినిస్ట్స్ అని చెప్పుకొనే చాలా మంది అవకాశం దొరికితే చాలు దూరిపోయి బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు. కాంటెక్స్ట్ ని మర్చిపోయి, అవతలి వాళ్ళు అసలు ఏం చెప్పారు అనే విషయం కూడా విస్మరించి తమకు కావల్సినది మాత్రమే హైలైట్ చేసి దానిని బూతద్దం పెట్టి చూపిస్తూ అనవసరం రాద్ధాంతం చేస్తూ ఉంటారు కొంత మంది.

పాపులర్ సింగర్ చిన్మయి మాత్రం ఎప్పటికప్పుడు తన వాయిస్ వినిపిస్తూ ఎక్కడైనా మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ అన్యాయం జరిగితే సహించేది లేదనే విధం గా తన వైఖరి ని స్పష్టం చేశారు. ఆవిడ కూడా కబీర్ సింగ్ మీద అభ్యంతరాలు చెప్పిన సంగతి విదితమే. చిన్మయి తో పాటు సమంత కూడా సినిమా మీద తన గళాన్ని వినిపించింది.

అయితే ఇప్పుడు సమంత, చిన్మయి కలిసి ఒకే వేదిక పైన కనిపించనున్నారట. అది కూడా హైదరాబాద్ లో మహిళలు అందరూ కలిసి ఒక మీటింగ్ లా పెట్టుకొని లైంగికం గా వేధింపులు గురి చేసే వాళ్ళ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయం పై చర్చిస్తారట. ఇప్పటికే చెన్నై లో చిన్మయి ఇలాంటి మీటింగ్స్ కి అటెండ్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అలాంటివే ప్లాన్ చేస్తున్నారట.

Loading...