Friday, April 26, 2024
- Advertisement -

అతను లైంగికంగా వేధించాడు.. : చిన్మయి శ్రీపాద

- Advertisement -

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద పలువురు చెన్నై జర్నలిస్ట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తు తనని లైంగింకగా వేధించాడని చెప్పినందుకు తనను ఇష్టానుసారం తిట్టారని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుస ట్వీట్లు చేశారు. ’వైరాముత్తు నన్ను లైంగికగా వేధించాడని చెప్పినందుకు తమిళ ప్రజలు, కొందరు జర్నలిస్టులు నన్ను నోటికొచ్చినట్లు తిట్టారు.

నాకు సిగ్గు అనేది ఉంటే చనిపోవాలని.. నాలాంటి వారి వల్లే నిజంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు న్యాయం జరగడం లేదని అన్నారు. ఓ ప్రెస్ మీట్ లో నేను జుట్టు సరి చేసుకుంటుంటే.. నా చేతులు, వక్షోజాలపై కెమెరాలు జూమ్ చేస్తూ కొందరు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీశారు. నేను టీ షర్ట్, ఫుల్ స్కర్ట్ వేసుకుని ప్రెస్ మీట్‌కు వచ్చానని యూట్యూబ్ ఛానెల్స్‌లో నా ఫొటోలు వేసి ఎగతాళి చేశారు.

అత్యాచార ఘటనల పట్ల ఎవరైతే బాధపడతారో వారంతా సమాజంలో మార్పును తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయరు. ధైర్యంగా పోరాడే అమ్మాయిలను ఈ సమాజం పట్టించుకోదు. నిర్భయ తల్లి మీడియా ముందు వచ్చినందుకు కూడా ఆమెపై విమర్శలు చేశారు. అత్యాచార ఘటనలు జరిగినప్పుడు చాలా మంది పేరున్న పెద్దవాళ్లు తమ సంతాపాన్ని తెలియజేస్తారు. వారికున్న పేరు ప్రతిష్టలతో బాధితురాళ్లకు సరైన లాయర్లను నియమించినవారు, ఆడపిల్లల కోసం ఎన్జీవోలను నిర్మించినవారు, తమ సోషల్ మీడియా ఖాతాలతో సమాజంలో మార్పులు తెచ్చినవారు ఎంత మంది ఉన్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి’ అని రాసుకొచ్చింది.

వైరాముత్తు గొప్ప లిరిసిస్ట్ కాబట్టి ఆయనను ఏవరు ఏం చేయలేకపోతున్నారు. మమ్ముల్ని మేము జాగ్రత్త పరుచుకోవడానికి పని, డబ్బు, అవకాశాలను వదులుకోవాల్సి వస్తోంది. 18 ఏళ్ల వయసులో వైరాముత్తు నా నడుం పట్టుకుని నన్ను ముద్దుపెట్టుకోవాలని అనుకున్నాడు. ఈ విషయంను ఎలా నిరూపించుకోవాలి ? ఎక్కడ నుంచి సాక్షాలు తేవాలి ? నా కళ్లలో, వక్షోజాల్లో కెమెరాలు పెట్టుకుని తిరగమంటారా? బస్సుల్లోనూ ఆడవాళ్లను ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారు. నా వక్షోజాలు పట్టుకున్నాడని ఎలా నిరూపించాలి?’ అంటూ వరస ట్వీట్లు చేసింది చిన్మయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -