Saturday, April 20, 2024
- Advertisement -

మద్యం తాగి నన్ను లైంగింగా వేధించాడు : చిన్మయి

- Advertisement -

కోలీవుడ్ లో వైరాముత్తు కు మంచి గేయ రచయితగా పేరున్న విషయం తెలిసిందే. అయితే వైరాముత్తు తనని లైంగికంగా వేధించాడని సింగర్ చిన్మయి శ్రీపాద షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ తాను అమాయకుడినని.. న్యాయం కోసం కోర్టుకు వెళ్లడానికి కూడా రెడీ అని వైరాముత్తు అన్నారు. అంతేకాకుండా చిన్మయి చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చాలా మంది అన్నారు.

ఈ సంగతి అటుంచితే.. ఇటీవల వైరాముత్తు ప్రముఖ కవి తిరువల్లువూరు జయంతి సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరువల్లువూర్ విగ్రహానికి పూల మాల వేసి ప్రసంగం ఇచ్చారు. ’తమిళనాడులో మద్యపానమే ఓ పెనుభూతంలా మారింది. మగవారు మద్యం సేవించడం వల్ల వారి ఆరోగ్యం పాడు కావడమే కాకుండా కుటుంబాన్ని కూడా కోల్పోతారు. అంతేకాదు ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరిగేది మద్యం సేవించడం వల్లే. కాబట్టి మద్యాన్ని నిషేధించండి’ అని తెలిపారు.

అయితే వైరాముత్తు ప్రసంగించిన వీడియోను చిన్మయికి ట్యాగ్ చేశాడు ఓ నెటిజన్. ఈ వీడియో చూసిన చిన్మయి వైరాముత్తుకు కౌంటర్ ఇచ్చింది. . ‘20, 30 ఏళ్ల క్రితమే మద్యాన్ని నిషేధించి ఉండుంటే.. వైరాముత్తు నాపై చేసిన లైంగిక వేధింపుల నుంచి తప్పించుకునేదాన్ని’’ అని తెలిపారు. ఇలా అవకాశం ఉన్నప్పుడల్లా వైరముత్తుపై చిన్మాయి ఫైర్ అవుతూనే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -