Thursday, March 28, 2024
- Advertisement -

మహిళల విషయంలో యేసుదాస్‌కి కౌంటర్ ఇచ్చిన చిన్మయి..!

- Advertisement -

సింగర్ చిన్మయి మళ్లీ వార్తల్లో నిలిచింది. ‘స్వామియే శరణం అయ్యప్పా.. మీ భక్తుల నుండి మీరే నన్ను కాపాడాలి’.. అంటూ అయ్యప్ప శరణు కోరుతోంది. మరి అంత కష్టం ఈమెకు ఏం వచ్చిందంటే.. శబరిమల ఇష్యూపై స్పందిస్తూ ప్రముఖ గాయకుడు యేసుదాస్‌కు కౌంటర్ ఇచ్చింది. దాంతో వివాదం చెలరేగింది. శబరిమల ఆలయ కట్టుబాట్లు ప్రకారం ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేకపోవడంతో కొన్ని మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతమంది రహస్యంగా ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయకుడు, అయ్యప్ప పాటలకు పేరుగాంచిన యేసుదాస్ స్పందిస్తూ కొన్ని సూచనలు చేశారు.

అయ్యప్పను స్మరిస్తూ యేసుదాస్ పాడే కీర్తనలు, పాటలు ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలిసిందే. ఎన్నో పాటలు పాడిన ఆయన శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై స్పందిస్తూ.. ఆలయంలోకి మహిళలను అనుమతించకపోవడానికి గల కారణంను తెలిపారు. శబరిమల ఆలయంలోకి మహిళలు వస్తే.. దాని ప్రభావం మాలలో ఉన్న ఉన్న అయ్యప్ప భక్తుల ఆలోచన, శ్రద్ధపై పడుతుందని దీక్షకు భంగం వాటిల్లుతుందనే కారణంతోనే అనుమతించడం లేదన్నారు. మహిళలు వెళ్లాలనుకుంటే చాలా ఆలయాలు ఉన్నాయి. అందమైన అమ్మాయిలు నేటి ఆదునిక వస్త్రాధారణతో శబరిమలకు వెళితే అయప్ప కళ్లు తెరిచి చూడడు కానీ.. భక్తుల దృష్టి వీరిపైకి మరలొచ్చు. అందుకే వారిని అక్కడికి రావొద్దని అంటున్నారు తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి దయచేసి అయ్యప్ప భక్తుల్ని టెంఫ్ట్ చేయొద్దనేది నా విన్నపం.. ఇదొక్కటే మిమ్మల్ని నేను కోరుకునేది అని యేసుదాస్ అన్నారు.

అయితే మహిళల హక్కులపై.. వారి వస్త్రధారణ తదితర అంశాలపై ఎక్కడ ఏం జరిగిన ముందుగా స్పందిస్తోంది సింగర్ సిన్మయి. యేసుదాసు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ’డియర్ అయ్యప్ప.. మీ భక్తుల నుంచి నన్ను కాపాడండి’ అంటూ యేసుదాస్ కామెంట్స్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది చిన్మయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -