బైక్ మీదా వచ్చి.. ఎక్కమని అడిగాడు.. : సింగర్ చిన్మయి ఫోస్ట్

1426
singer chinmayi sripada shares a womens ordeal from telangana through twitter
singer chinmayi sripada shares a womens ordeal from telangana through twitter

లైంగింక వేధింపుల గురించి ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతునే ఉంటారు ప్రముఖ సింగ చిన్మయి శ్రీపాద. తమిళ ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి సంచలనం రేపింది చిన్మయి. ఇక తాజాగా తన ట్విట్టర్లో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టింది. తెలంగాణకు చెందిన ఓ యువతికి సంబంధించిన ఫోస్ట్ అది. ఆ పోస్టులో ఏం ఉందంటే..

“ఓసారి కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ 28 ఏళ్లు ఉన్న వ్యక్తి బైక్ మీదా వచ్చి నా ముందు ఆపి అడ్రెస్ అడిగాడు. నేను అడ్రెస్ చెప్పిన తర్వాత అతి తెలివి చూపించి.. ’నాకు అడ్రెస్ సరిగ్గా అర్దం కాలేదు.. నాతో బైక్ మీదా వచ్చి చూపిస్తారా’ అని అడిగాడు. అందుకు నేను ఎవరినైన అబ్బాయిని అడగమని అన్నాను. కానీ అతను వినకుండా.. తన వద్ద లైసెన్స్ కూడా లేదని.. పోలీసులు పట్టుకుంటే ప్రాబ్లమ్ అని.. అదే వెనక అమ్మాయి కూర్చుంటే వదిలేస్తారని సాకులు చెప్పాడు. నాకు భయంగా అనిపించి.. నాకోసం మా అన్నయ్య వస్తున్నాడని చెప్పి అక్కడ నుంచి పరుగులు పెట్టాను. ఇంటికి చేరుకోవడానికి రెండు గంటలు పడుతుంది.

ప్రాణలు అరచేతిలో పెట్టుకున్నాను. అయితే ఈ అనుభవం ఎదురైన కొన్ని రోజుల తర్వాత నా చెల్లెలికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తున్న ఆడపిల్లలకు ఇలాంటి అనుభవాలను తరచూ ఎదురవుతున్నాయి. చాలా మంది ఏవేవో సాకులు చెప్పి నెంబర్లు తీసుకోవాలని యత్నిస్తున్నారు. నేనే కాదు నా ప్రెండ్స్ కూడా ఇలాంటివి ఎదుర్కున్నారు” అని రాసుంది. ఈ పోస్ట్ చిన్మయి ట్విట్టర్లో షేర్ చేయడం వల్ల బాగా వైరల్ అయింది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. ఇలాంటి పోస్టుల పెడితే అయిన అమ్మాయిలకు అవగాహన వస్తుందని చిన్మయి అభిప్రాయం.

Loading...