Thursday, April 25, 2024
- Advertisement -

బెంజ్ కారు కొన్న రాహుల్ సిప్లీగంజ్..!

- Advertisement -

తెలుగు లో బిగ్ బాస్ మూడో సీజన్ పెద్ద సంచలనం. దీనికి మంచి క్రేజ్ ఉంది. అయితే ఈ సీజన్ లో విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు. తర్వాత అతనికి విపరితమైన క్రేజ్ వచ్చింది. ఇక ఈ షోలో మరో స్పెషల్ కంటిస్టెంట్ పునర్నవి. వీరిద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీ హైలైట్ అని చెప్పాలి. వీరిద్దరి క్లోజ్ రిలేషన్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో షో తర్వాత కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు.

వీరిద్దరి జంటకు క్రేజ్ రావడంతో వీరికి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఈ జంట ఆట, పాట, టాస్క్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ పాపులారిటీ క్యాచ్ చేసుకునేలా పలు ఈవెంట్స్‌లో వీరిని ప్రత్యేక ఆకర్షణ చేస్తున్నారు. ఇక కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాహుల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

రాహుల్‌కు జోడిగా శివాత్మిక రాజశేఖర్ నటిస్తోంది. ఇక తాజాగా రాహుల్ కారు కొన్నాడు. రాహుల్ కి కార్లు అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచో ఓ కాస్ట్లీ కారు కొందాం అనుకుంటున్నాడు. మొత్తానికి ఇటీవలే కాస్ట్లీ బెంజ్ కారును కొనేశాడు. దీని ఖరీదు దాదాపుగా కోటి రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. సో రోజు రోజుకి రాహుల్ రేంజ్ పెరిగిపోతుంది.

https://www.facebook.com/RahulSipligunjOfficial/videos/983464055373396/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -