Thursday, March 28, 2024
- Advertisement -

శారదా పీఠాధిపతి పై సింగర్ సునీత ఆగ్రహం

- Advertisement -

శ్రీ శారదా పీఠం స్వరూపానంద సరస్వతి అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నిత్యం ఆయన వద్దకు ఎంతో మంది భక్తులు వెల్తూ వస్తూ ఉంటారు. అందులో సినిమా వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఆయన ఇటీవలే ఒక ఛానెల్ లో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆయన వద్దకు తరచుగా ఎవరెవరు వస్తూ ఉంటారో చెప్పారు. అందులో సింగర్ సునీత పేరు కూడా మెన్షన్ చేశారు కానీ సునీత ఆయనని కలిసిన్దే లేదట.

“ఇప్పటి వరకు నా మీద అనేక పుకార్లు వచ్చాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూ నే ఉంటుంది. కొన్ని మాత్రం అలా అలా స్ట్రాంగ్ గా మారుతూ ఉంటాయి. వాటి పై స్పందించాల్సిన అవసరం చాలా ఉంది. అందులో ఒకటి శ్రీ స్వరూపానంద సరస్వతి చేసిన కామెంట్స్. ఒక ఫెమస్ పర్సనాలిటీ ఐన ఆయన నా పేరు ని ఆయన విజిటర్స్ లిస్ట్ లో చేర్చారు. అసలు నేను ఇప్పటి వరకు ఆయనని వెళ్ళి కలిసినదే లేదు. ఆయన ఇలా ఎందుకు చెప్తున్నారు, అది కూడా ఒక నేషనల్ ఛానెల్ లో.. నాకు ఏమి అర్ధం కావడం లేదు. ఇక పై ఇటువంటి విషయాల మీద కూడా నేను పట్టించుకోకుండా ఉండాల్సిందేనా?” అని ఆవిడ ప్రశ్నించారు.

అంతే కాకుండా స్వరూపానంద సరస్వతి చేసిన వ్యాఖ్యల కి సంబందించిన వీడియో ని కూడా ఆవిడ పోస్ట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -