Wednesday, April 24, 2024
- Advertisement -

పవన్‌కు పిన్ని దొరికింది!

- Advertisement -

తెలుగులో ఎందరో లేడీ సింగర్స్ వచ్చారు, వెళ్ళారు కానీ వాళ్ళందరిలో సునీత వేసిన ముద్ర ప్రత్యేకమైంది. ఎప్పుడు తెరమీద కనిపించికపోయినా ఓ హీరోయిన్‌కి ఉన్నంత ఫాలోయింగ్ ఆమె సొంతం. బహుశా తెలుగులో అంత అందమైన అంత ఫాలోయింగ్ ఉన్న సింగర్ ఎవరూ లేరంటే అతిశయోక్తి లేదు. 

గాయని గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను సునీత వేసిన ముద్ర ప్రత్యేకమైంది. వెండి తెరపై తళుక్కుమనే లావణ్యం అమెకున్నా గతంలో ఎంతో మంది తనను సంప్రదించినా సినిమాలలో ఒప్పుకోలేదు. 

శేఖర్ కమ్ముల మీద అభిమానంతో అనామిక సినిమా కోసం ఓ ప్రమోషన్ సాంగ్ చేసింది సునీత.  ఇప్పుడు పవన్‌కళ్యాణ్ , త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ’కోబళి’లో పవన్ పిన్నిగా నటించడానికి రెడీ అయిందని ఫిల్మ్ నగర్ టాక్.  

పిన్ని పాత్ర చాలా స్టైలిష్‌గా, అందంగా ఉంటుందట. అత్తారింటికి దారేది మూవీలో నదియా పాత్ర అంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. అందుకని ఈ క్యారెక్టర్‌ కి సింగర్ సునీత అయితే నప్పుతుందని త్రివిక్రమ్ ఆమెని అప్రోచ్ అయ్యారట. ఇందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఫిల్మ్‌ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, అసలు సెట్స్ మీదకు వెళుతుందో లేదో తెలియాలంటే… వేచి చూడాల్సిందే. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -