Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ లో వచ్చింది.. ఇందుల్లో పారబోశాడు

- Advertisement -

స్నేహమేరా జీవితం సినిమా గురించి మార్కెట్లో రకరకాల కథనాలు సర్కులేట్ అవుతున్నాయి. ఈసినిమాను నిజానికి శివబాలాజి రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశాడు. దాదాపుగా కోటి నుంచి కోటిన్నర వరకు ఖర్చు పెట్టాడు. అయితే శివబాలాజికి ఫేం లేకపోవడంతో సినిమా బిజినెస్ కాక ఆగిపోయింది.దాంతో రొటీన్ గానే సినిమా కష్టాలు వచ్చాయి.ఆ టైమ్లోనే బిగ్ బాస్ రావడం ..అంతకు ముందు కాటమరాయుడులో కనిపించడంతో శివబాలాజి ఫ్యామిళీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.

ఇక బిగ్ బాస్ విజేతగా నిలవడంతో ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది.ఆ క్రేజ్ తోటే అయిపోయిన సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి.. వదిలేశారు. ఒక విధంగా చెప్పాలంటే..బిగ్ బాస్ లో వచ్చిన 50లక్షలను ఇక్కడే ఖర్చు పెట్టేశాడు. ఇంకో డేరింగ్ స్టెప్ ఏంటంటే.. సినిమాకు ఈ టైమ్లో కూ డా కరెక్ట్ బిజినెస్ కాకపోవడంతో వాళ్లను వీళ్లను నమ్ముకోవడం దేనికని తానే స్వయంగా సినిమాను రిలీజ్ చేసేశాడు. అసలే థియేటర్లు లేకపోవడం ..ఉన్న తక్కువ థియేటర్లోనే సినిమా రిలీజ్ చేయడంతో సినిమాకు అనుకున్నంత పేరు రాలేదు. అయినప్పటికి అన్ని టివి ఛానల్లను కవర్ చేస్తూ… మా సినిమా వచ్చింది చూడండ్రా బాబు అంటూ చెప్పడంతో బి,సి సెంటర్లో సినిమాకు కాస్త ఊపిరి వచ్చిందనే టాక్ వినిపిస్తుంది.

ఏది ఏమైనా..ఇలాంటి టైమ్లో శివబాలాజి అన్ని రైట్స్ రూపంలో గంపగుత్తగా సినిమా హక్కులను అమ్మేసుంటే…ఎంత లేదన్నా ఇంకో కోటి రూపాయలు వచ్చేదని.. అలా కాకుండా బిగించుకు కూర్చోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ లో వచ్చిన డబ్బు కూడా రాని పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఏది ఏమైనప్పటికీ ఇలాంటి టైమ్లో శివబాలాజి ఇలా చేసి ఉండకూడదు. బహుశ తనకు కొత్తగా వచ్చిన సినిమా అవకాశాలతో ఇలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకున్నాడని అంతా అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -