Friday, March 29, 2024
- Advertisement -

రోజుకో ఎనౌన్స్ మెంట్… వారానికో రిలీజ్… ఇదేంటి వర్మ..!

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ఎంత పెద్ద సంచలన దర్శకుడంటే తాను క్లియర్ గా ఒకరిని టార్గెట్ చేశానని అందరికి తెలిసినా అతను నేను అనుకున్నది కాదు మీరు అనుకున్నది అని మాట మారుస్తాడు.. దాంతో రామ్ గోపాల్ వర్మ లాంటి ఎథిక్స్ లేని వ్యక్తి తో పెట్టుకోవడం ఎందుకని అందరు సైలెంట్ గా ఉండడాన్నికి ప్రయత్నిస్తాడు.. ఇక ఈమధ్య గతి తప్పిన అయన దర్శకత్వానికి గతి తప్పని సినిమాలు అన్నట్లు అయన చేస్తున్న కొన్ని సినిమాలు అందరిని నవ్వు తో పాటు కోపాన్ని కూడా తెప్పిస్తున్నాయి..

రోజుకో సినిమా ఎనౌన్స్ మెంట్, వారానికో సినిమా రిలీజ్ ఇదేంటి వర్మ ఇలా సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు అని అందరు తెగ ఆలోచిస్తుంటే ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక చూస్తే రామ్ గోపాల్ ఇంతలా దిగజారిపోయాడేంటి అని అంటున్నారు.. ఇక తాజగా దిశా అనే సినిమా ని రూపొందించాడు రామ్ గోపాల్ వర్మ.. ఇటీవలే హైద్రాబాద్ లో జరిగిన ఓ అమానుష ఘటన కు ఈ సినిమా ప్రేరణ కాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశాడు వర్మ..

మాములు ప్రేక్షకులు చూడ్డానికే ఇబ్బంది పడేలా, బాధపడేలా ఉన్న ఈ ట్రైలర్ నిజమైన దిశ ఇంటి సభ్యులు ఈ ట్రయిలర్ చూస్తే గుండె ముక్కలయ్యేలా బాధపడరా అని వర్మ టార్గెట్ చేస్తున్నారు నెటిజన్స్.. అనవసరంగా మర్చిపోయిన గాయాన్ని రేపి మళ్ళీ మళ్ళీ బాధపడేలా చేయడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు.. ఇలాంటి సినిమా తీసి ఆర్జీవీ సాధించేది ఏమిటి.. సామాజిక బాధ్యత వుండక్కరలేదా కనీసం మానవతా విలువలైనా వుండాలి కదా? మన చర్యలతో ఆ కుటుంబాన్ని మరింత బాధపెట్టకూడదు అనే ఇంగిత జ్ఞానం అయినా వుండాలి కదా. అని అంటూ వర్మ ని మరొకసారి వార్తల్లో నిలిచేలా చేసింది ఈ ట్రైలర్..

లగ్జరీ కార్లను బహుమతులుగా ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..!

మెగాస్టార్ చిరంజీవి వదిలేసిన సినిమాలు ఇవే..!

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

‘కార్తీక దీపం’ వంటలక్క గురించి షాకింగ్ నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -