Friday, March 29, 2024
- Advertisement -

సోలో బ్రతుకు కు ఇంతకంటే బెటర్ ఆలోచన రాలేదా..?

- Advertisement -

రేయ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.. కానీ ఆమధ్య వరుసగా 9 ఫ్లాప్ సినిమాలు చేసి చాలా డిప్రెషన్ కి గురయ్యాడు.. ఇటీవలే చిత్ర లహరి హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు.. అప్పటివరకు సాయి ధరం తేజ్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక తేజ్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు.. కానీ ఫెయిల్యూర్, సక్సెస్ కాన్సెప్ట్ తో సినిమా చేసి ప్రేక్షకులను బాగానే మెప్పించారు.. ఇక ఆ సినిమా తర్వాత మారుతీ దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా క్లీన్ హిట్ సాధించి సాయి ధరం ను మళ్ళీ టాప్ చైర్ లో కూర్చో బెట్టింది..

వరుసగా రెండు హిట్లు సాధించిన జోష్ లో సాయి ధరం తేజ్ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే వెరైటీ సినిమా చేస్తున్నారు..  తమన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ కాగ వీరి కంబోలో వచ్చిన అన్ని చిత్రాలు మ్యుజికల్ గా  హిట్ అయ్యాయి అని చెప్పొచ్చు.. అందుకే సాయి ధరం తేజ్ అవసరమైతే తప్పా సంగీత దర్శకుడిని మార్చడు.. ఇక సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా ద్వార పరిచయమవుతున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు, టీజర్, ట్రైలర్ కి మంచి పేరు రాగ తేజు కి మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు..

ఈ సినిమా లో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కట్లు కొడుతుంది. థియేటర్ లు ఆరు నెలలుగా మూతపడి ఉన్న కారణంగా పలు సినిమాలై డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఓటీటీలో కొత్త తరహాలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలను తీసుకు వస్తున్నాడు. ఇప్పటికే ఆయన తన పలు సినిమాలను పే పర్ వ్యూ అనే పద్దతిలో విడుదల చేశాడు. చిన్న సినిమాలకు టికెట్లు పెట్టిన వర్మ లక్షల రూపాయలు సంపాదించాడు. ఇప్పుడు ఆయన దారిలోనే మరికొందరు స్టార్స్ కూడా తమ సినిమాలను పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను కూడా పే పర్ వ్యూ పద్దతిలో విడుదల చేయబోతున్నారట. దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా ఉంది. ఒక వ్యూ కు టికెట్ ధర 100 నుంచి 150 రూపాయల మధ్య పెడితే వర్కవుట్ అవ్వొచ్చనే దిశగా ప్లానింగ్ జరుగుతోందని తెలిసింది. మెగా హీరో కాబట్టి రెస్పాన్స్ బాగుండొచ్చని ఒక అంచనా. అయితే ప్రైమ్ లాంటి యాప్స్ నెల మొత్తం కలిపి 129 రూపాయలు తీసుకుంటున్నప్పుడు కేవలం 48 గంటలు మాత్రమే చెల్లుబాటు అయ్యే పే పర్ వ్యూ ఎలా సక్సెస్ అవుతుందని అంటున్న వాళ్ళు లేకపోలేదు. 

బిగ్ బాస్ 4 విన్నర్ ఎవరో తెలిసిపోయింది..!

ప్రభాస్ పెళ్లి ఫోటోపై స్పందించిన అనుష్క..!

OTT లకు సంక్షోభం.. అన్ని ఫ్లాప్ సినిమాలే.. సూర్య..?

బిగ్ బాస్ 4 కు నాగార్జున బై.. ఏం జరిగింది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -