సోనూసూద్ ఆస్తి ఎన్నికోట్లో తెలుసా ?

1398
Sonu Sood Gifts A Tractor To Chittoor Farmer
Sonu Sood Gifts A Tractor To Chittoor Farmer

లాక్ డౌన్ టైంలో డబ్బులు, ఇళ్లు ఉన్న వారి పరిస్థితి బానే ఉంది. కానీ పొట్టకూటి కోసం సొంత ఊరిని వదిలేసి ఇతర ప్రదేశాలకు వచ్చిన వారి పరిస్థితి దారుణంగా మారింది. ప్రభుత్వం అందించే సాయం అందకా రైళ్ళు, బస్సులు లేక సొంత ఇంటికి చేరలేక.. తిండి లేక చాలా మంది చాలా రకలుగా ఇబ్బంది పడ్డారు. అలాంటి సమయంలో వారిని ఆదుకోవడానికి హీరోలా వచ్చాడు అతను.

మమల్ని ఎవరు ఆదుకుంటారా అని వలస కార్మికులందరూ ఎదురు చూస్తున్న క్రమంలో సోనూ సూద్ నేనున్నాను అంటూ వారిని సొంత గూటికి చేర్చి హీరో అయ్యాడు. వాళ్ళందరిని బస్సులు రైళ్లు ద్వారా వారి ఇంటికి చేర్చాడు. అప్పటి నుంచి నేటివరకు దేశంలో ఏ మూల నుండి ఎవరు ఏ సాయం అడిగిన అందిస్తూనే ఉన్నాడు. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడుతున్న ఒక రైతుకు ట్రాక్టర్ కొనిచ్చి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆస్తులు ఉన్న పెట్టే మనస్తత్వం అందరికి ఉండదు.

కానీ సోనూసూద్ మాత్రం అందుకు వ్యతిరేకం. కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న రాజకీయ నాయకులు తారలు చేయలేని పనులని సోనూసూద్ చేస్తుంటే ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయనే చర్చ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ఓ బాలీవుడ్ మీడియా సంస్థ సోనూ ఆస్తులపై అధ్యయనం చేయగా.. అతడి మొత్తం ఆస్తుల విలువ 130 కోట్లు అని తేలింది. సోను 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ సంపాధించినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన ఇప్పటి వరకు పది కోట్లు ఖర్చు చేశాడని అంటున్నారు.

వేల కోట్లు ఉన్న హీరోలతో పోలిస్తే తనకున్న దాంట్లోనే సోనూసూద్ చేస్తున్న సాయం చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. సినిమాల ద్వారా బాగానే సంపాదించిన సోనూ ముంబైలో పెద్ద ఇల్లు కొన్నాడు. హోటళ్లు తెరిచాడు. ఇటీవల తన హొటల్ని వైద్యుల కోసం కేటాయించాడు కూడా. ఇంత గొప్ప మనసు ఉన్న ఈ సోనూ సినిమాల్లో విలన్ కావొచ్చు. కానీ బయట మాత్రం రియల్ హీరోనే. ప్రస్తుతం సోను సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు.

మోసం చేశాడు.. వాడి పళ్లు రాలగొడుతా : సింగర్ సునీత ఫైర్

‘మర్డర్’ ట్రైలర్.. కళ్ళ కట్టినట్టు చూపించిన వర్మ..!

నితిన్ పెళ్లి కానుకగా ‘రంగ్ దే’ దృశ్య మాలిక

ఘనంగా నితిన్, శాలిని పెళ్లి..!

Loading...