Friday, April 26, 2024
- Advertisement -

నాన్నకు సారీ చెప్పాలి అంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు

- Advertisement -

గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారి తనయుడు ఎస్ పి చరణ్ తన తండ్రి వారసత్వాన్ని మరియు గొంతు ని కూడా పునికిపుచ్చుకుని ఒక గాయకుడిగా 2500 లకు పైగా పాటలు పాడటమే కాక నిర్మాతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. కెమెరా కి ఎప్పుడూ దూరంగానే ఉండే చరణ్ తాజాగా అలీ హోస్ట్ చేస్తున్న టాక్ షో కి విచ్చేసి తన బాల్యం, కుటుంబం గురించి బోలెడు కబుర్లు చెప్పారు. ఈ షో లో మాట్లాడుతూ, “మీరు పోగొట్టిన డబ్బులు మీవా? మీ నాన్నగారివా?” అని అలీ అడుగగా ఎస్ పి చరణ్ మొదటి సినిమా డబ్బు నాన్నగారిదేనాని, రెండో సినిమా బిజినెస్‌ అయింది కానీ పెట్టుబడి పెట్టిన వాళ్లకు మాత్రం బాగా రాలేదని ఆ మొత్తాన్ని చెల్లించడానికి మళ్ళీ నాన్నగారి వద్ద తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

“మూడో సినిమా పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా ఇచ్చిన ధైర్యంతో మరో మూడు తమిళ సినిమాలు చేశా. అన్నీ పోయాయి. నష్టం కూడా పెద్దదైపోయింది. పేరు మిగిలింది కానీ డబ్బులు రాలేదు. నాన్నగారి డబ్బు పోగొట్టానని ఇప్పటికీ బాధపడుతుంటాను కానీ ఆయన మాత్రం నన్ను పన్నెత్తి మాట అనలేదు. ఆ విషయంలో ఆయనకు సారీ చెప్పాలి.” అని అన్నారు చరణ్. “మీ నాన్నలో నీకు నచ్చనిది ఏమిటి? అని అడుగగా ఎస్పీ చరణ్‌ నాకు నాన్నే పెద్ద బలం కానీ, ఆయన పర్‌ఫెక్షన్‌ నాకు కాస్త చికాకు గా అనిపిస్తుంది అన్నారు. “ఆయన చాలా ఓపికగా ఉంటారు. అసలు అలా ఎలా ఉండగలరో అర్థం కాదు. ఈ షో ద్వారా ఆయనకు సారీ చెప్పాలనుకుంటున్నా. ఒక కొడుకుగా నేను ఆయనను చాలా అల్లరి పెట్టాను. చాలా ఇబ్బందులు కూడా కలిగించాను. వాటికి సారీ అనే పదం సరిపోదు. మీరు లేకుంటే నేను లేను. ప్రతిరోజూ నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఏదో ఒకరోజు మీకన్నా కొంచెమైనా ఎక్కువ సాధించాలని ఉంది. తప్పకుండా సాధిస్తాను” అని చెప్పుకొచ్చారు ఎస్పీ చరణ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -