Thursday, April 25, 2024
- Advertisement -

విష్ణు ప్రియతో అవినాష్ పెళ్లి.. శ్రీముఖి దగ్గర ఉండి ఇలా..!

- Advertisement -

ప్రస్తుతం యాంకర్ శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది. తన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాధించుకుంది. అలానే బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మరింత క్రేజ్ సంపాధించుకుంది. శ్రీముఖి సినిమాల్లో కూడా నటించింది. ’జులాయ’, ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మన్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో నటించింది. అయితే రొమాన్స్ సీన్స్ చేయడం ఇష్టం లేక సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవల ఆమె హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసి షాకిచ్చింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆమె.. తన ఫొటోలు, వీడియోలు, కెరీర్‌కు సంబంధించిన విషయాలను మాత్రమే పంచుకునేది. కానీ, కొద్ది రోజుల క్రితం ఒక్కసారిగా బోల్డ్ గెటప్‌లో దర్శనిచ్చే సరికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే తాజాగా జబర్ధస్త్ కమెడియన్‌తో యాంకర్ విష్ణు ప్రియకు పెళ్లి చేసేసింది శ్రీముఖి. బతుకు బలైపోయిందంటూ వీడియో వదిలింది.

దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీముఖి. అవినాష్‌ – విష్ణు ప్రియకు పెళ్లి చేసింది రియల్‌గా కాదు… ‘బతుకు బలైపోయిన బండి’ అనే కామెడీ స్కిట్‌లో. ‘రచ్చబండ’, ‘బతుకు జట్కా బండి’ వంటి ప్రోగ్రామ్‌లకు స్ఫూఫ్‌గా వచ్చిన ఈ వీడియోలో శ్రీముఖి యాంకర్‌గా కనిపించింది. కరోనా కారణంగా ఇంట్లో ఉంటున్న భార్య భర్తలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఇందులో కామెడీగా చూపించారు. మీరు కూడా ఓ లుక్కేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -