Friday, April 19, 2024
- Advertisement -

హైపర్ ఆది నీకు పెళ్లి అవసరమా ? : శ్రీరెడ్డి

- Advertisement -

శ్రీరెడ్డి పేరుకి నటే కానీ ఆమె చేసిన సినిమాలు ఒక్కటి రెండు మాత్రమే. కాకపోతే ఆమె సినిమాల్లో కంటే మీడియా ముందు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమం తెలుగు నాట ఉవ్వెత్తున లేచేలా చేసింది శ్రీ రెడ్డి. ఫిల్మ్ ఛాంబర్ ఎదురుగా అర్దనగ్న ప్రదర్శన, పవన్ కళ్యాణ్‌ను, ఆయన తల్లిని మీడియా ముఖంగా దూషించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.

ఆ తరువాత పరిణామాలన్ని మారడంతో సైలెంట్ అయిన శ్రీరెడ్డి చెన్నైలో సెటిలైంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఘాటు పోస్ట్‌లను చేస్తోంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. వలస కార్మికులు, ఉపాధి కోల్పోయిన దినసరి కూలీల దీనావస్థ గురించి శ్రీ రెడ్డి ఎమోషనల్ అయింది. వారికి కనీస వసతులు కల్పించడని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇక ప్రస్తుతం గత కొన్ని రోజులుగా హైపర్ ఆది పెళ్లి గురించి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఆ మధ్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ఈ వార్తలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై శ్రీ రెడ్డి ఓ సెటైర్ వేసింది. హైపర్ ఆది పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘హైపర్ ఆది గాని పెళ్లైతే కరోనా చస్తదా? ఆన్‌లైన్‌లో వాని పెళ్లి మీద ఓ గోల, 42 ఏళ్లలో ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే ఏంది?’ అంటూ పోస్ట్ చేసింది. మరి దీనిపై హైపర్ ఆది ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -