Friday, April 26, 2024
- Advertisement -

వైల్డ్ కార్డు ఎంట్రీ గా శ్రీ రెడ్డి?

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో శ్రీ రెడ్డి కి ఉన్న క్రేజ్ మరొకరికి లేదు. అయితే ఇది అందరి లా కష్టపడి సంపాదించుకున్న క్రేజ్ కానే కాదు. గత ఏడాది సినిమా పరిశ్రమ లో మీ టూ మూమెంట్ లో భాగం గా కాస్టింగ్ కౌచ్ విషయం లో శ్రీ రెడ్డి పోషించిన పాత్ర వలన తనకి ఈ క్రేజ్ వచ్చింది. అలాగే ఫిలిం చాంబర్ దగ్గర తను చేసిన అర్ధ నగ్న ప్రదర్శన కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. అయితే అప్పట్లో బిగ్ బాస్ షో కి శ్రీ రెడ్డి ని కన్సిడర్ చేస్తారు అనే రూమర్స్ వచ్చిన నేపథ్యం లో మౌనం వహించారు. బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి పిలుపు వస్తుంది అని శ్రీ రెడ్డి వేచి చూసిన విషయం నిజమే.

అయితే ఇప్పుడు కూడా బిగ్ బాస్ షో లో మూడో సీజన్ కి వైల్డ్ కార్డు ఎంట్రీ కింద శ్రీ రెడ్డి వస్తారు అనే రూమర్స్ పై ఆవిడ ఘాటుగా స్పందించారు. “నా జీవితానికి నేనే బాస్ ని. నా పైన నాకు ఒక కృత్రిమ బాస్ అవసరం లేదు.” అని ఆవిడ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. దీని బట్టి చూస్తే శ్రీ రెడ్డి బిగ్ బాస్ షో లో పాల్గొనడం లేదు అనే విషయం స్పష్టం గా అర్ధం అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -