చిరంజీవిని బండ బూతులు తిట్టిన శ్రీరెడ్డి..!

1248
Sri Reddy Shocking Comments On Chiranjeevi
Sri Reddy Shocking Comments On Chiranjeevi

గతంలో పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి బండ బూతులు తిట్టింది నటి శ్రీరెడ్డి. అయితే తాజాగా బిగ్ బాస్ వేదికపై తమన్నా సింహాద్రని ఉద్దేశించి చిరంజీవి చేసిన కామెంట్స్ శ్రీరెడ్డికి తగిలాయి. దాంతో మెగాస్టార్ చిరుపై మండి పడింది శ్రీరెడ్డి. నిజానికి పవన్ కళ్యాణ్ అంటే శ్రీ రెడ్డి కి అసలు పడదు. కానీ చిరు పై ఎప్పుడు కూడా అసభ్య కామెంట్స్ చేయలేదు. కాస్త అభిమానమే చూపించింది.

అయితే బిగ్ బాస్ స్టేజ్ పై శ్రీరీడ్డిని పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవి విమర్శించడంతో శ్రీరెడ్డి మండింది.. దాంతో మెగాస్టార్ ని బండ బూతులు తిట్టింది. “సారీ చిరంజీవి గారు.. నేను చాలా స్మూత్‌గానే మాట్లాడుతున్నా.. మంచి గురించి మాత్రమే మాట్లాడుతున్నా.. నా వ్యాఖ్యల్ని తీసుకోండి. మీకు పేరు ఉంది కాబట్టి మేమంతా వెధవలమా? వయసు కాదు జ్ఞానం ఉండాలి” అంటూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి. “ఎంతో మంది టాలెంటెడ్ హీరోయిన్స్‌ని తొక్కి తొక్కి 13 హీరోస్‌ని కన్నారు.

నన్ను కూడా తొక్కుతారా? నన్ను కెలకవద్దు. నా జోలికొస్తే పంబ పగిలి రంభ బయటకొస్తాది” అంటూ చిరంజీవికే వార్నింగ్ ఇచ్చింది. ఆదివారం నాడు జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. హౌస్‌లో ఉన్న తమన్నా సింహాద్రిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.‘తమన్నా. . వెరీ డైనమిక్ గర్ల్. తేడాలొస్తే చీల్చి చెండాడుతావ్. ప్రేమిస్తే.. మనసు ఇచ్చేస్తావ్. తప్పు జరిగితే ఏదైనా సరే.. బయటకు వచ్చి బాహాటంగా మాట్లాడగలిగే ధైర్య వంతురాలివి నువ్. నువ్వు అప్పటి వరకూ ఎవర్ని సపోర్ట్ చేసినా సరే.. వాళ్లు మంచి వ్యక్తుల్ని విమర్శిస్తే.. ఆ ఫ్రెండ్ షిప్‌ని కూడా కట్ చేసుకుని బయటకు వచ్చి నువ్ చేస్తున్నది చెప్పే ధైర్యం నీలో ఉన్నది.

ఆవిషయంలో నిన్ను అభినందిస్తున్నా. ఇది నీకు నాకు మాత్రమే అర్ధమై ఉంటుంది. ఇంకెవరికీ అర్ధంకాకపోవచ్చు.. కరెక్టేనా?’ అంటూ తమన్నాని ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాటలు శ్రీరెడ్డిని ఉద్దేశించి అన్నవి అని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం తో అవి శ్రీరెడ్డి వరకు వెళ్లాయి. దాంతో చిరంజీవిని పేస్ బుక్ వేదిక గా తిట్టింది శ్రీరెడ్డి.

Loading...