Friday, April 19, 2024
- Advertisement -

మాజీ సీఎం మనవడు, హీరో నన్ను రాత్రి వాడుకున్నారు : శ్రీరెడ్డి

- Advertisement -

శ్రీరెడ్డి.. వివాదాస్పద నటి.. ఇప్పటికే ఈమె ఆరోపణలతో పవన్ కళ్యాణ్, నాని, విశాల్, లారెన్స్ లాంటి వాళ్లు బుక్కయ్యారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎదుట బట్టలిప్పి నగ్నంగా నిలబడిన ఈమె సంచలనం సృష్టించారు. ఆ తర్వాత టాలీవుడ్ లో అవకాశాల పేరుతో తనను వాడుకున్న వారిందరి గుట్టూ మట్లు చెబుతూ వైరల్ అయ్యారు.

ఇప్పటికే చాలా మందిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తాజాగా మాజీ సీఎం మనవుడు, తమిళ హీరో ఉదయనిధి స్టాలిన్ పై బాంబు పేల్చింది. తాజాగా ఆమె తన ఫేస్ బుక్ పేజీలో సంచలన కామెంట్ చేసింది.

శ్రీరెడ్డి పోస్టు పెడుతూ ‘హాయ్ ఉదయనిధి స్టాలిన్ సార్..మూడేళ్ల క్రితం మనం హైదరాబాద్ లోని గ్రీన్ పార్క్ హోటల్ లో షూటింగ్ సందర్భంగా కలిశాం.. హీరో విశాల్ మిమ్మల్ని నాకు పరిచయం చేశాడు. ఆరోజు రాత్రి మనమిద్దరం లైంగికంగా కలిశాం. ఆ రోజురాత్రి మనమిద్దరం చాలా చేశాం. నాకు సినిమాల్లో చాన్స్ ఇస్తానని మీరు మాట ఇచ్చి ఛాన్స్ ఇవ్వలేదు.. మీరు మరిచినా నేను మరవను’ అంటూ బాంబు పేల్చారు.

అంతేకాదు.. ఈ విషయంపై తనను టార్గెట్ చేసి రచ్చ చేస్తున్న వారికి పూర్తి వివరాలు చెబుతానంటూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు.

కాగా ఉదయనిధి అక్కడ ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు. హీరోతోపాటు డీఎంకే యూత్ వింగ్ అధ్యక్షుడు కూడా. ఈయనపై శ్రీరెడ్డి ఆరోపణలు ఇప్పుడు తమిళనాట దుమారం రేపుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -