Friday, April 19, 2024
- Advertisement -

నవంబర్ లో శ్రీకాంత్ ‘రా..రా’

- Advertisement -

మైటీస్టార్ శ్రీకాంత్ ఒంటిరి పోరాటం ఇప్పట్లో ఆగేలా లేదు. వరుస పరాజయాలు ఎదురవుతున్నా… ప్రయత్నాలు మాత్రం మానడం లేదు. దీనికి తోడు ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తూ ‘యుద్ధం శరణం’ తో ప్రతినాయకుడిగా మరొక ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

సపోర్టింగ్ రోల్స్ శ్రీకాంత్ కు బాగానే వర్కవుట్ అవుతున్నప్పటికీ… సోలో హీరోగా మాత్రం సాలిడ్ హిట్ కొట్టలేక పోతున్నాడు. ఇతగాడు ఫుల్ లెంగ్త్ హీరోగా చేసిన చివరి సినిమాలు ‘టెర్రర్, మెంటల్ పోలీస్’ పరాజయాన్ని చూడటంతో మరొక ట్రైల్ వేసే ప్లాన్ కు సిద్దమయ్యారు.

ఇందుకోసమని ఈసారి ఆయన చేసిన చిత్రం ‘రా..రా’. శంకర్ డైరెక్షన్ చేసిన ఈ ఫిలిం నవంబర్ 17న మన ముందుకు రానుంది. హర్రర్ థ్రిల్లర్ గా రూపోందిన ఈ చిత్రంలో నజియా, సీతా నారాయణ హీరోయిన్లుగా నటించారు. షకీల్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని విజి చెరిష్ విజన్ బ్యానర్ పై విజయ్ నిర్మించారు. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు.అన్నీ భాగానే ఉన్నాయి కాని… ఈసినిమా కూ డా తేడా కొడితే అప్పటికైనా నిజం తెలుసుకుని జగపతిబాబు మాదిరిగా ప్రతినాయకుడు,క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వేస్తాడంటారా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -