ఎవరూ చేయని విధం గా శ్రీముఖి ప్రమోషన్స్

1271
SriMukhi Family Conducting Special Campaign
SriMukhi Family Conducting Special Campaign

బిగ్ బాస్ షో లో ప్రస్తుతం అందరి కన్నా బాగా ఆడుతుంది శ్రీముఖి. తనకి ఇంట్లో అందరి కన్నా ఎంతో ఎక్కువ పాపులారిటీ కూడా ఉంది.అయితే తనకి రానున్న వారాల్లో ఆట ఎంతో ముఖ్యం. పైగా ఈ వారం నామినేట్ కూడా అయిన తరుణం లో శ్రీముఖి ఇంటి సభ్యులు తన కోసం స్పెషల్ కాంపైన్ లాంచ్ చేశారు.

“9 వారాలుగా బిగ్ బాస్ ఇంట్లో ఉంటున్న మా అమ్మాయి శ్రీ ముఖి ని అత్యధిక ఓట్లు సేవ్ చేస్తూ మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించినందుకు నా ధన్యవాదాలు. ఈ 9 వారాలు ఒక ఎత్తు అయితే ఇకపై జరగబోయేది ఒక ఎత్తు…. మీరు మా అమ్మాయి పై చూపిస్తున్న ప్రేమ అనురాగలు నేను నా జీవిత కాలంలో ఎప్పటికి మరిచిపోలేను. దీన్ని మీరు రిస్క్ గా భావించకుండా నా అమ్మాయి అని కాకుండా మీ కుటుంబ సభ్యురాలిగా భావించి మీరు మా అమ్మాయికి వోట్ వేసి మరియు ప్రతి ఒక్కరికి షేర్ చేసి మీ యొక్క ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.” అని శ్రీముఖి ఫ్యామిలీ మెంబర్స్ సోషల్ మీడియా లో కాంపైన్ చేస్తున్నారు.

శ్రీముఖి ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్ లాగా ఇంట్లో కొనసాగుతుంది. మరి ఎంత వరకు ఇలా ముందుకు సాగుతుంది అనే విషయం మునుముందు తెలుస్తుంది.

Loading...