Thursday, April 25, 2024
- Advertisement -

షూట్ కి తయారవుతున్న జక్కన్న

- Advertisement -

బాహుబలి తరువాత రాజమౌళి ఏం సినిమా తీస్తాడు అనే ఆసక్తి రేగిన సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ రాజమౌళి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లతో RRR అనే సినిమా ను అనౌన్స్ చేశాడు. ఇప్పటికే సినిమా కి సంబందించిన రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి అయినప్పటికీ త్వరలో ఒక పెద్ద ముఖ్యమైన షెడ్యూల్ మొదలు కానున్నది.

ఈ షెడ్యూల్ లో ముఖ్య నటులు అందరు పాలుపంచుకొనట్టు తెలుస్తుంది. మే 21 న అల్యూమినియం ఫ్యాక్టరీ లో మొదలు కానున్న ఈ షెడ్యూల్ అలియా భట్ కూడా జాయిన్ అవ్వనున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ సరసన అలియా భట్ నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ గురించి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ సినిమా కి సంబందించిన సెట్ వర్క్ అల్యూమినం ఫ్యాక్టరీ లో జరుగుతుంది. సబో సిరిల్ నేతృత్వం లో ఈ సెట్ పనులు చాలా వేగం గా జరుగుతున్నాయి.

ఈ సినిమా కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అజయ్ దేవగన్ ఒక కీలక పాత్ర లో మెరవనున్నారు. డీవీవీ దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా కి సంబందించిన వివరాలు త్వరలో తెలుస్తాయి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -