Friday, March 29, 2024
- Advertisement -

మహేష్ సినిమా స్క్రిప్ట్ పని రాజమౌళి ప్రారంభించారా?

- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీయబోతున్నట్టు రాజమౌళి ప్రకటించి సంచలనం సృష్టించారు. కేఎల్ నారాయణ నిర్మాణంలో 8 సంవత్సరాల క్రితమే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉందని.. అయితే రాజమౌళి ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడం వల్ల ఆలస్యం అయ్యిందని సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమా కు కథ, స్క్రిప్ట్ ను రాజమౌళి ప్రారంభింపచేశారని వార్తలు వచ్చాయి. 2022లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.

అయితే తాజాగా మహేష్ బాబుతో సినిమా కోసం కథను ఖరారు చేయలేదని రాజమౌళి వెల్లడించారు. మహేష్ ప్రాజెక్ట్ కోసం కథను సిద్ధం చేయడానికి ఈ లాక్ డౌన్ కాలాన్ని రాజమౌళి ఉపయోగించుకుంటున్నట్టు సమాచారం.

రాజమౌళి ప్రతీ సినిమాకు ఆయన తండ్రి విజయేంద్రప్రసాదే కథను అందిస్తారు. ప్రస్తుతం ఈ తండ్రీకొడుకుల ద్వయం సూపర్ స్టార్ మహేష్ బాబుకు అనుకూలంగా ఉండే కథాంశాల గురించి చర్చించడంలో బిజీగా ఉన్నట్టు తెలిసింది.

రాజమౌళి ఒక బేసిక్ పాయింట్ ను తీసుకొని దానిని తనదైన శైలిలో అభివృద్ధి చేయడానికి తండ్రి విజయేంద్రప్రసాద్ సహాయం తీసుకుంటారు. ఇప్పుడు మహేష్ బాబు కోసం ఏలాంటి కాన్సెప్ట్ ను రాజమౌళి ఎంపిక చేశారన్నది మహేష్ అభిమానులే కాదు.. మొత్తం టాలీవుడ్ జనాలు కూడా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబులాంటి సూపర్ హీరోకు రాజమౌళి జోడైతే తెరపై అద్భుతమే జరుగుతుంది మరీ. దాని కోసం వెయిట్ చేద్దాం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -