Wednesday, April 24, 2024
- Advertisement -

త్వరలో విడుదల కాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ లుక్

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా ఎన్టీఆర్ కొమరంభీం పాత్ర పోషించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలో విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది కాబట్టి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటుందట. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే రోజు ప్రభాస్ ‘సాహో’ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక బాహుబలి లాగానే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -