Saturday, April 20, 2024
- Advertisement -

భారీ రేటుకు అమ్ముడైన ‘ఆర్ ఆర్ ఆర్’ రైట్స్

- Advertisement -

‘బాహుబలి’ సినిమా తరువాత జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరొక ప్రతిష్టాత్మక సినిమా ‘ఆర్ఆర్ఆర్’ టాలీవుడ్ లోనే అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చే ఏడాది విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ అక్షరాల అరవై ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడయినట్లు తెలుస్తోంది. దుబాయ్ లోని ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్ ను కొనుక్కున్నారట.

చైనాలో తప్ప మిగతా అన్ని దేశాల్లో అన్ని భాషల రైట్స్ ను ఈ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. ఆ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సింగిల్ పేమెంట్ డీల్ ని క్లోజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఓవర్సీస్ రైట్స్ కి 65 కోట్లు వచ్చాయంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రైట్స్ విలువ ఎంత ఉండబోతుందో ఊహించవచ్చు. మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ హీరోయిన్ కోసం ఇంకా వెతుకులాట జరుగుతోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -