Friday, March 29, 2024
- Advertisement -

కొడుకు సినిమా కి రాజమౌళి రిపేర్లు

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో దర్శక దిగ్గజాలు కొందరే ఉన్నారు. కానీ ఇవాళ మన జెనరేషన్ కి మాత్రం అది రాజమౌళి ఒక్కడే. సినిమా సినిమా కి ఒక్కో మెట్టు ఎక్కుతూ నిజమైన ప్యాషన్ ఎలా ఉంటుంది అని నిరూపిస్తూ తెలుగు సినిమా ని అంతర్జాతీయ స్థాయి లో అందరూ గర్వించదగ్గ స్థాయి కి తీసుకొని వెళ్తున్నాడు. అయితే తన సినిమాలు అన్నిటికి తన కుమారుడు కార్తికేయ వెన్ను దన్నుగా ఉంటాడు. కార్తికేయ ఇంకా సినిమా రంగం కి సంబంధించి చాల పనుల్లో నిమగ్నమై ఉంటాడు. గత ఏడాది ఆకాశవాణి అనే సినిమా తో నిర్మాత గా రంగ ప్రవేశం చేస్తున్నట్టు కూడా ప్రకటించాడు.

అయితే ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ పూర్తయిందట. దాదాపు అందరూ కొత్త వాళ్ళ తో ఈ సినిమా ని చేశారట దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా కి సంబందించిన ఒక వర్షన్ ని రాజమౌళి చూశారట. సినిమా లో కొన్ని పోర్షన్స్ సరిగా రాలేదని, మార్పులు చెప్పి, వాటిని మళ్ళీ షూట్ చేయాల్సింది గా కోరాడట. ప్రస్తుతం టీమ్ ఆ పని లో నే ఉందట. అందుకే ఈ సినిమా రావడానికి సమయం పడుతుందట. ఈ సినిమా ని సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలనేది కార్తికేయ ఆలోచన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -