Friday, March 29, 2024
- Advertisement -

థమన్ ని రంగం లోకి దింపిన త్రివిక్రమ్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా బన్నీ కెరీర్ లో చాలా ప్రత్యేకం. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి విజయాల తర్వాత మూడో సారి ఈ సినిమా కోసం బన్నీ త్రివిక్రమ్ తో పని చేస్తున్నాడు. అయితే గత ఏడాది మే లో విడుదల అయిన నా పేరు సూర్య సినిమా పరాజయం పొందాక బన్నీ కొంత గ్యాప్ తీసుకొని ఈ సినిమా తో మన ముందుకు వస్తున్నాడు.

అయితే ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న చిత్ర బృందం త్వరలో నే ఒక కీలక షెడ్యూల్ ని కూడా మొదలు పెట్టనుంది. అలాగే త్రివిక్రమ్ కూడా ఒక వైపు షూటింగ్ కానిస్తూనే సమయం దొరకగానే థమన్ తోటి సంగీత చర్చల్లో పాల్గొంటున్నాడు. ముందు నుండి ఈ సినిమా గురించి పాజిటివ్ గా ఉన్న టీమ్ ఇప్పుడు ఈ సినిమా ని అనుకున్న దాని కన్నా ముందుగా నే కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

బన్నీ కూడా ఈ ఏడాదే ఎలాగైనా సినిమాని విడుదల చేయాలని చూస్తున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -