250 ఎకరాల్లో రాజ‌మౌళి కొడుకు పెళ్లి

453
Star director Rajamouli booked Baahubali like venue for Karthikeya
Star director Rajamouli booked Baahubali like venue for Karthikeya

దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంటే ఇప్పుడు నేష‌న‌ల్ లేవ‌ల్లో క్రేజ్ ఉంది.మ‌రి అలాంటి రాజ‌మౌళి కొడుకు పెళ్లి అంటే మామూలుగా ఉంటుందా?. రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ వివాహానికి సర్వం స‌న్న‌ద్దం అవుతుంది.త‌న సినిమాల మాదిరిగానే త‌న కొడుకు పెళ్లిని కూడా భారీత‌నంతో చేస్తున్నాడు రాజ‌మౌళి.డేట్‌తో పాటు వేదిక కూడా ఫిక్స్ అయింది. పెళ్లి కార్డు నుంచి పెళ్లి మండ‌పం వర‌కు ప్ర‌తిది ప్ర‌త్యేక‌మ‌ని తెలుస్తుంది.త‌న సినిమాల‌లో సెట్టింగ్‌ల మాదిరిగానే వివాహ మండ‌పాన్ని నిర్మించార‌ని స‌మాచారం.

న‌టుడు జగపతిబాబు అన్నయ్య రాంప్రసాద్ కూతురు పూజ ప్రసాద్‌కి రాజమౌళి కొడుకు కార్తికేయకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయం తెలిసిందే. కార్తికేయ, పూజల వివాహానికి జైపూర్ వేదిక కానుంది. డిసెంబర్ 30న వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. 250 ఎకరాల జైపూర్‌లోని ప్యారామౌంట్ హోటల్లో వీరి వివాహం జ‌ర‌గ‌నుంది.ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచే కాక బాలీవుడ్ నుంచి ప‌లువురు సెల‌బ్రిటీలు వ‌స్తార‌ని స‌మాచారం.త‌న కొడుకు పెళ్లి వ‌ల్ల ‘RRR’ షూటింగ్‌కు కాస్తా బ్రేక్ ఇచ్చాడు రాజ‌మౌళి.పెళ్లి ప‌నులు పూర్తి అవ్వ‌గానే తిరిగి ‘RRR’ షూటింగ్‌ను మొద‌లు పెట్ట‌నున్నాడు ద‌ర్శ‌కధీరుడు.