Friday, April 26, 2024
- Advertisement -

సై రా అవకాశం కాదనుకుని బాధ పడుతుంది ఎవరు?

- Advertisement -

సై రా నరసింహ రెడ్డి సినిమా ట్రైలర్ నిన్న నే విడుదల అవ్వడం జరిగింది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ ని జెనరేట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మరియు ఇతర సినిమా పరిశ్రమల్లో కూడా ఈ సినిమా ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ లో ముఖ్య పాత్రధారులు అందరూ ఉండేలాగా చూసుకున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్య పాత్రలని అన్నిటినీ పరిచయం చేస్తూ, వాటిని పోషించిన నటుల్ని కూడా చూపెట్టారు. ఆ ప్రక్రియ లో భాగం గా ఈ సినిమా లో లక్ష్మి అనే పాత్ర ని పోషిస్తున్న తమన్నా ని కూడా చూపించారు.

మేకింగ్ వీడియో లో కూడా తమన్నా కి చోటు కల్పించడం తో పాటు ఏకంగా ట్రైలర్ లో తమన్నా డైలాగ్ ని కూడా చూపెట్టారు సినిమా యూనిట్. ఇది చూస్తే తమన్నా పాత్ర ఎంత ముఖ్యమైనది అనే విషయం యిట్టె అర్ధం అవుతుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే తమన్నా పాత్ర ని తమన్నా కన్నా ముందే చాల మంది ని అప్రోచ్ కాగా అందరూ ఏవేవో కారణాలు చెప్పి వదులుకున్నారట.

ఇప్పుడు తమన్నా పాత్ర కి ఉన్న ప్రాముఖ్యత ని రియలైజ్ అయ్యి, ఆ పాత్ర ని వదులుకున్నందుకు బాధ పడుతున్నారు అని కొన్ని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఆ హీరోయిన్లు ఎవరో ఏంటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -