Thursday, April 25, 2024
- Advertisement -

తన అసిస్టెంట్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్..!

- Advertisement -

ఏ హీరో అభిమానులు అయిన తమ హీరో బర్త్ డే వచ్చిందంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. పెద్ద పెద్ద కౌటట్లు.. బ్యానర్లు.. ప్లెక్సీలు.. కేక్ కట్టింగ్ లు.. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆ హీరో బర్త్ డేని ట్రెండ్ చేస్తారు. తమ ఫేవరెట్ హీరో ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే హీరోల పుట్టిన రోజులను ఫ్యాన్ చేయడం కామన్.

కానీ ఒక హీరో దగ్గర పని చేసే అసిస్టెంట్ పుట్టిన రోజును హీరో సెలబ్రేట్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి బర్త్ డే సెలబ్రేషన్ ఇప్పుడు జరిగింది. ఆ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కొంతమంది హీరోలు ఎంత స్టార్ ఇమెజ్ వచ్చిన ఒదిగే ఉంటారు. వారిలో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఇటీవలే తన కుమారుడు అల్లు అయాన్ బర్త్ డేను.. తర్వాత తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న బన్నీ లేటెస్టుగా తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసే వ్యక్తి పుట్టిన రోజుని కూడా సెలెబ్రేట్ చేసి తన మంచి మనసు చాటుకున్నాడు.

తన అసిస్టెంట్ శివ బర్త్ డే సందర్భంగా తనయుడు అయాన్ చేతుల మీదుగా తన పర్సనల్ అసిస్టెంట్ కి కేక్ కటింగ్ చేపించాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో కేక్ చూస్తుంటే హోమ్ మేడ్ కేక్ అని తెలుస్తోంది. తన అసిస్టెంట్ పుట్టిన రోజు కోసం బన్నీ స్వయంగా తన ఇంట్లోనే ఈ కేక్ తయారు చేయించి బర్త్ డే సెలెబ్రేట్ చేయడం గ్రేట్ అంటున్నారు ఇది తెలిసిన వాళ్ళు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. ఏది ఏమైన తన అసిస్టెంట్ బర్త్ డేకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి స్వయంగా కేక్ చేయించి బర్త్ డే చేయించడం అనేది చాలా గ్రేట్. అందుకే బన్నీకి గొప్ప మనసు ఉందని ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -