పవన్ గారు నాకు దడం పెట్టిగానే షాక్ అయ్యాను : సుడిగాలి సుధీర్

730
Sudigali Sudheer About Pawan Kalyan
Sudigali Sudheer About Pawan Kalyan

జబర్దస్త్ కమెడియన్‌గా సుడిగాలి సుధీర్ భారీ పాపులారిటీ సంపాధించుకున్నాడు. హీరో పవన్ కళ్యాణ్ అంటే సుడిగాలి సుధీర్ కి చాలా ఇష్టం. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసిన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ కొన్ని విషయాలు చెప్పాడు సుధీర్. నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. సర్దార్ గబ్బర్ సింగ్‌లో ఆయనతో కలిసి పని చేశా. ఆయని దూరం నుంచి చూస్తే చాలు అనుకునేవాడిని.

కానీ సర్దార్‌కి బాబీగారు నన్ను పిలిచి.. చిన్నపిల్లాడిలా ఉన్నావ్.. కానిస్టేబుల్‌లా సూట్ కావేమో.. అని అన్నప్పుడు సార్ హెయిర్ కట్ చెయ్యించుకుంటాను, కావాలంటే రోజు జిమ్‌కి వెళ్లిపోతాను. నాకు మంచి క్యారెక్టర్ ఏం వద్దు. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ రోజులు చూడాలి నేను. జూనియర్ ఆర్టిస్ట్‌గా అయినా చేస్తాను.. అని బాబీగారితో చెప్పాను. నేనసలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలు అనుకున్నాను. అలాంటిది సెట్స్‌లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నమస్కారం సుధీర్ గారు అనేవారు.

పవన్ కళ్యాణ్ గారు నాకు దన్నం పెట్టడం ఎలాగా? అసలు.. ఆ ఫీలింగ్ ఎంతలా ఉంటుంది? మనం ఎవరినైతే ప్రేమిస్తామో.. ఎవరి కోసమైతే చచ్చిపోతామో.. అలాంటి వ్యక్తి వచ్చి నమస్కారం సుధీర్ గారు అంటే ఏలా ఉంటుంది? దాన్ని అసలు వివరించలేను నేను. ‘సార్ నమస్కారం సార్’ అనేవాడ్ని. ‘రండి కూర్చోండి.. చైర్ వెయ్యరా సుధీర్ గారికి..’ అనేవారు. ‘సార్ వద్దుసార్ వద్దుసార్.. నేను కూర్చోలేను సార్’ అన్నా సరే కూర్చే వేసి కూర్చోబెట్టుకుని మిమెక్రీ చెయ్యమని అడిగేవారు. అంత డౌన్‌ టు ఎర్త్ మనిషిని చూసి ఉండం అని పవన్ కళ్యాణ్ మంచితనం గురించి చెప్పుకొచ్చాడు సుధీర్.

Loading...