‘ఛీ దరిద్రుడా.. తూ’ అని సుధీర్ పరువు తీసిన రష్మీ..!

1372
Sudigali Sudheer And Sekhar Master Vulgar Punches To Rashmi
Sudigali Sudheer And Sekhar Master Vulgar Punches To Rashmi

జబర్దస్త్ చూస్తే పొట్టచెక్కలు అయ్యేలా నవ్వాల్సిందే. ఇక జబర్దస్త్‌తో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్‌లోనూ పంచ్‌లకు కొదువ ఉండదు. రష్మి-సుధీర్ కాంబినేషన్‌లో పంచ్‌లు అయితే బాగా పేలుతాయి. రొమాంటిక్ డోస్ బాగా దట్టిస్తారు. తాజా ప్రోమోలో రష్మీని సాయంత్రం పంపు సెట్ దగ్గరకు వస్తావా అని డైరెక్ట్ గా సుధీర్ అడిగేశాడు.

ప్రోమోలో లుంగీ కట్టుకుని ‘నాదీ నక్కిలీసు గొసులు’ అనే పాటకు డాన్స్ చేస్తూ సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. ‘నువ్ లుంగీ కట్టుకుని వచ్చావంటే అర్థమైపోయింది.. ఎక్కడ నుంచి వచ్చావో’ అని శేఖర్ మాస్టర్ పంచ్ విసిరాడు. వెంటనే ‘రష్మీ.. ఏంటీ ఈ మధ్య పొలం పనులకు రావట్లేదు.. సాయంత్రం పంపుసెట్ దగ్గరకు వచ్చెయ్ అని ఓపెన్ అయ్యాడు సుడిగాలి సుధీర్. అతను డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి దిగడంతో బిత్తరపోయింది రష్మి. అంతటితో ఆగకుండా.. ‘ఏం చేస్తున్నావ్ రా అని గెటప్ శీను’ ముసలి గెటప్‌లో అడిగితే.. ‘పిట్ట కూతకు వచ్చింది కదా.. రమ్మంటున్నా’ అంటూ మరో వల్గర్ పంచ్ వేసి.. ‘పొలం కూతకు వచ్చింది కదా.. అందర్నీ పనిలోకి రమ్మని చెప్తున్నా’ అంటూ కవర్ చేసుకున్నాడు.

ఈలోపు శేఖర్ మాస్టర్.. ‘ఎందుకూ పొలం దున్నడానికా’ అంటూ మరో డబుల్ మీనింగ్ పంచ్ వేశాడు. ఇంతకీ పనికి రమ్మని వాళ్లని ఎలా పిలుస్తున్నావ్ అని శీను అడగ్గా.. ‘ఏముంది కనపడిన వాళ్లనల్లా.. పొలంకి వచ్చేయండి సాయంత్రం (కన్నుకొడుతూ) అని చెప్తున్నా’ అంటూ సుధీర్ రెచ్చిపోయాడు. అతను కన్ను కొడుతూ.. సాయత్రం పంపుసెట్ దగ్గరకు వచ్చెయ్ అని రష్మి వైపు చూడగా.. ఆమె ‘ఛీ దరిద్రుడా.. తూ’ అనేసింది. మీరు కూడా ఈ ప్రోమో ఒకసారి చూడండి.

అతనితో విడిపోయాక చాలా రూమర్స్ వచ్చాయి : యాంకర్ ఝాన్సీ

జబర్దస్త్ లో రోజా ఎందుకు కనిపించడంలేదో తెలుసా ?

రానా, మిహీకాల పెళ్లి సందడి మొదలు..!

ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

Loading...