Friday, March 29, 2024
- Advertisement -

హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్ …హీరోయిన్ ర‌ష్మియేనా..?

- Advertisement -

వెండితెర మీద‌నే కాదు బుల్లితెర మీద కూడా హీరోలు ఉంటారని నిరుపించాడు సుడిగాలి సుధీర్‌. ప్ర‌ముఖ ఈటీవీ ఛానెల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్థ‌స్త్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వ‌చ్చాడు సుధీర్‌. మొద‌ట కంటెస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి త‌రువాత టీం లీడ‌ర్‌గా ఎదిగాడు. అప్ప‌టి నుంచి సుడిగాలి సుధీర్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఢీ, పోవే పోరా వంటి షోల‌కు యాంక‌రింగ్ చేస్తు చాలామంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

సుధీర్‌కు హీరోల‌తో పాటు స‌మానంగా అభిమానులు ఉన్నారంటే మ‌నోడి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఇదంతా ఎంద‌క‌ని అనుకుంటున్నారా… ? ఏం లేదండి సుడిగాలి సుధీర్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఇప్ప‌టికే జ‌బ‌ర్థ‌స్త్ నుంచి చాలామంది న‌టులు క‌మెడియ‌న్లుగా, హీరోలుగా మారిన సంగ‌తి మ‌నకి తెలిసిందే. తాజాగా సుధీర్ కూడా హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్‌లో చిన్న సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి బాగా పాపుల‌ర్ అయిన ఓ ద‌ర్శ‌కుడు సుధీర్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేయ‌డానికి ముందుకు వ‌చ్చాడ‌ని స‌మాచారం.

హీరోగా చేయ‌డానికి సుధీర్ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. దీంతో త్వ‌ర‌లోనే ఈ సినిమా మొద‌లు కానుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే మీడియాకు తెలియ‌జేస్తార‌ట‌. గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఒక చిన్న సినిమా నిర్మితమైందిగానీ, కొన్ని కారణాల వలన అది విడుదల కాలేదు. బుల్లితెర మీద స్టార్ అనిపించుకున్న సుధీర్ వెండితెర మీద ఎలాంటి క్రేజ్‌ను సంపాదించుకుంటాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -