Thursday, April 25, 2024
- Advertisement -

ఘ‌నంగా సుడిగాలి సుధీర్ పెళ్లి..వ‌ధువు ఎవ‌రో తెలుసా?

- Advertisement -

సుడిగాలి సుధీర్ …ఈ పేరు బుల్లితెర మీద సంచ‌ల‌న‌మే అని చెప్పాలి. బుల్లితెర మీద కూడా స్టార్స్ ఉంటార‌ని నిరుపించాడు సుధీర్‌. త‌క్కువ కాలంలోనే హీరోల‌తో స‌మానంగా త‌న క్రేజ్‌ను తెచ్చ‌కున్నాడు సుధీర్‌. ఈటీవీ చానెల్లో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యాడు. అత‌డు యాక్టింగ్‌కు చాలామంది అభిమానులే ఉన్నారు. సుధీర్‌కు అమ్మాయిల‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఢీ, పోవే పోరా వంటి షోల‌కు యాంక‌రింగ్ చేస్తున్నాడు సుధీర్‌.

ఈ రెండు షోలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండంటం మ‌నం చూస్తునే ఉన్నాం. సుడిగాలి సుధీర్ గురించి సోష‌ల్ మీడియాలో రోజుకో వార్త పుట్టుకొస్తునే ఉంది. గ‌త కొంతకాలంగా సుధీర్ ,ర‌ష్మిల ఎఫైర్ గురించి ర‌కార‌కాల వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు పెళ్లి చేసుకోబోతున్నార‌ని కొన్ని గాసిప్స్ కూడా వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను అటు ర‌ష్మితో పాటు సుధీర్ కూడా ఖండిచడం జ‌రిగింది. తాజాగా సుధీర్ సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నాడు.

అవును మీరు వింటుంది నిజ‌మే సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకున్నాడు. కాక‌పోతే ఇది నిజ జీవితంలో కాదు. ఈటీవీ ప్ల‌స్‌లో ప్ర‌సార‌మ‌య్యే పోవే పోరా షోలో పెళ్లి చేసుకున్నాడు సుధీర్‌. పెళ్లి కొడుకుగా సుధీర్ క‌నిపించ‌గా, పెళ్లి కూతురుగా యాంక‌ర్ విష్ణు ప్రియ క‌నిపించింది. దీనికి సంబంధించిన ప్రొమోను యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు షో నిర్వాహాకులు. ఈ ప్రొమోలో నిజంగా సుధీర్‌, విష్ణు ప్రియకు పెళ్లి జ‌రిగిన‌ట్లు చూపించారు.

దీనిని చూసిన వారు జంట బాగుంద‌ని కామెంట్ చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ ప్రొమో యూట్యూబ్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. గ‌తంలో యాంక‌ర్ ర‌ష్మిని కూడా ఇలాగే పెళ్లి చేసుకున్నాడు సుధీర్‌. దీంతో రీల్ పెళ్లిళ్లు ఓకే రియ‌ల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని సుధీర్‌ని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు. మ‌రి దీనిపై సుధీర్ ఎలాంటి స‌మాధానం ఇస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -